Image result for high court combined ap



నత్త నడకకు మన ఇండియా పోస్ట్ మినహా వేరే ఉదాహరణ అక్కరలేదు. సాధారణ పోస్ట్ అయితే ఏదో కొంత సర్ధుకోవచ్చు. ఇప్పుడు స్పీడ్ పోస్ట్ కూడా అదే కేటగిరీలో చేరి పోయింది. ఈ విషయాన్ని పోస్టల్ శాఖకు జరీమానా విదిస్తూ  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరోసారి దృవీకరించింది. పరుగు పందేంలో ఇండియా పోస్ట్ కంటే నత్త నయం. 


   
ఓ విద్యార్థి దరఖాస్తును సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో నిర్లక్ష్యం వహించి, అతడు ఎంబీబీఎస్‌ సీటు కోల్పోయేందుకు కారణమైన పోస్టల్‌ శాఖకు ఉమ్మడి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సీటు కోల్పోయిన విద్యార్థి సాయికుమార్‌రెడ్డికి 8 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. పోస్టల్‌ శాఖ తన నిర్లక్ష్యంతో ఓ ప్రతిభావంతుడైన విద్యార్థి ఆశలను నాశనం చేసిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


Image result for speed post

హైదరాబాద్‌కు చెందిన కె.సాయికుమార్‌రెడ్డి ఎంబీబీఎస్‌ సీటు కోసం ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు సకాలంలో అందక పోవడంతో సదరు కాలేజీ సాయి కుమార్‌కు ప్రవేశాన్ని నిరాకరించింది. దీనిపై అతను ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వెల్లడైన తరువాత 16.9.2016 న తాను తన దరఖాస్తును స్పీడ్‌ పోస్టు ద్వారా ఢిల్లీకి పంపానని, పోస్టల్‌ శాఖ ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ద్వారా 19.9.2016 న చేరినట్లు తెలిసిం దన్నారు. దరఖాస్తు సమ ర్పణకు చివరి తేదీ 7.10.16 అని వివరించాడు.  


అయితే, సాయికుమార్‌రెడ్డి దరఖాస్తు 18.10.16న తమకు అందిందని, అప్పటికే ప్రవేశాల చివరి తేదీ ముగిసిందని ఈఎస్‌ఐ అధికారులు కోర్టుకు నివేదించారు. దరఖాస్తు సకాలంలో అందక పోవడం తమ వైపునుంచి జరిగిన తప్పుకాదని  పోస్టల్‌ శాఖ తెలిపింది. ఇందుకు తాము ఇండియన్‌ పోస్టాఫీస్‌ చట్టం కింద తాము శిక్షార్హులం కాదని తెలిపింది. ఈ వాద నను ధర్మాసనం తోసి పుచ్చింది. ఆ రక్షణ కేవలం సాధారణ ఉత్తరాలు, రిజిస్టర్‌ ఉత్తర్వులకే వర్తిస్తుంది తప్ప, ఇతర కొరియర్‌ సంస్థలతో పోటీపడు తూ చేస్తున్న స్పీడ్‌ పోస్ట్‌ కార్యకలాపాలకు కాదని నిర్ద్వందంగా చెప్పింది. స్పీడ్-పోస్ట్  వాణిజ్యపరిధిలోకే  వస్తుందని  స్పష్టం చేసింది.


Image result for high court combined ap

మరింత సమాచారం తెలుసుకోండి: