మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఈ జాడ్యం చివరకు మైనల్ బాలురకు కూడా సోకినట్టు కనిపిస్తోంది. సికింద్రాబాద్ లో ఓ మైనర్ బాలుడు.. మైనర్ బాలికను గర్భవతిని చేసిన దారుణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన ఓ మైనర్ బాలిక ఇంటర్ చదువుతోంది.

minor girl rape కోసం చిత్ర ఫలితం
అదే కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆమెను ట్రాప్ చేశాడు.. మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఏకంగా గర్భవతిని చేశాడు. పాపం ఆ బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆ చిన్నారి ఫిబ్రవరి 14న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరింది. మరుసటి రోజు 15వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

minor girl rape కోసం చిత్ర ఫలితం

గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆ రోజే ఆల్వాల్ పోలీసులకు సమాచారం అందించారు. మైనర్ బాలికను ఇంటికి పంపి... శిశువును శిశువిహార్ కు తరలించారు. ఇది జరిగి 
నెలరోజులవుతున్నా ఆల్వాల్ పోలీసులు ఈ దారుణంపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఆ బాలుడి వెనక రాజకీయ అండదండలు ఉండటమే కారణంగా కనిపిస్తోంది. 

సంబంధిత చిత్రం
రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు చొరవతో ఈ దారుణం మీడియాకు తెలిసింది. దాంతో కంగారు పడిన ఆల్వాల్ పోలీసులు స్పందించారు.  సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అచ్యుతరావును కూడా బాలుడి తరపు వారు బెదిరిస్తున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: