ఉత్తరాఖండ్ సీఎం రేసులో.. త్రివేంద్ర సింగ్


ఆరెస్సెస్ ప్రచారక్ స్థాయి నుంచి ప్రారంభించి.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి సిద్ధంగా ఉన్న ఈ వ్యక్తి పేరు.. త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడైన అమిత్ షా కు సన్నిహితుడైన ఈయన సీఎంగా ఎంపికయ్యే అవకాశాలు బలంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఉత్తరాఖండ్ లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ.. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోవడానికి శుక్రవారం సమావేశం అవుతోంది.


గోవా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మరో ఎమ్మెల్యే...



గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్. నిన్న విశ్వజిత్ రానే అనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మరవకముందే.. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఎస్ రోడ్రిగ్స్ అనే ఎమ్మెల్యే గోవా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ప్రధాన కారణమేంటని ప్రశ్నించినప్పుడు.. అతడు ‘రాహుల్ గాంధీని నాయకుడిగా నేను అంగీకరించడం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. గోవా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు.


ఐడియా బంఫర్ ఆఫర్


రిలయన్స్ జియో దెబ్బకు టెలికం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ కస్టమర్లు ఇతర టెలికం నెట్ వర్క్ ల వైపుకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి.అయితే తాజాగా ఐడియా 2జీ, 3 జీ, 4జీ నెట్ వర్క లకు ఒకే ధరకు డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఐడియా నెట్క్ వర్క్ తన డేటాను ఒకే ధరకు విక్రయించాలని నిర్ణయించినట్టుగా ప్రకటించింది. ఈ కొత్త విధానం మార్చి నెలాఖరు నుండి అమల్లోకి రానున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.


ప్లాస్టిక్ తో పది రూపాయాల నోటు తయారీకి కేంద్రం అనుమతి...


ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా పది రూపాయాల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక సహయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్ సభలో ప్రకటించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాను ఆయన లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని ప్రకటించారు.


యువతి గాయత్రి మంత్రం.. షరీఫ్‌ చప్పట్లు...


పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కొలువుదీరిన ఓ కార్యక్రమంలో హిందూ యువతి చక్కగా గాయత్రి మంత్రానికి సంబంధించిన గీతాన్ని పాడి అందరి హృదయాలను దోచుకుంది. అక్కడ ఉన్న అంతా ఆమెపై చప్పట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు శ్రద్ధగా విన్న ప్రధాని షరీఫ్‌ కూడా పాట ముగిసిన తర్వాత చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల (మార్చి) 15న పాకిస్థాన్‌లో మైనారిటీలు అయిన హిందువులు హోలీ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఓ కార్యక్రమం ఏర్పాటుచేయగా దానికి ప్రధాని షరీఫ్‌తోపాటు పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: