2019 ఎన్నికల్లో బలమైన మోదీని ఢీ కొట్టి విజయం సాధించడం అంత సులువైన విషయం కాదని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెబుతున్నారు. మోదీని దెబ్బ కోట్టాలంటే ప్రాంతీయ శక్తులను కూడగట్టుకోవడంతో పాటు  ...  ఐక్య కూటమి అవసరమంటున్నారు.  అధి నాయకత్వానికి చరిష్మా ఉన్న  ... బీజేపీకి మిత్రపక్షాలు ఎక్కువగా ఉండటం కాంగ్రెస్కు ఇబ్బందిగా మారిందని విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మోదీని దెబ్బ తీయాలంటే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పెద్దలు విశ్లేషణలు చేస్తున్నారు. 2014 నుంచి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల నుంచి నివేదికలను తెప్పించుకుని ..అంశాల వారిగా విశ్లేషించే పనిలో పడ్డారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చిన ..అన్ని పార్టీలతో కలిపి చూస్తే భారీ వ్యత్యాసం ఉండటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.  బంపర్ విక్టరీ సాధించిన ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ 39.7 శాతం ఓట్లే సాధించిందని  ..కాంగ్రెస్, ఎస్పీ,బీఎస్పీ కలిస్తే 50.2 శాతం ఓట్లు సాధించామని లెక్కలు వేశారు.  ఇదే తరహాలో 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ 31.34 శాతమే ఓట్లు సాదించిందని ... ఇప్పుడు అన్ని పార్టీలను కలుపుకని పోతే విజయం సాధించగలుగుతామని అంచనా వేస్తున్నారు. 


ప్రధానంగా మోదీని దెబ్బతీయాలంటే మూడు అంశాలను ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఐక్యత, వ్యతిరేకత,యువత,  ఆధారంగా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో మోదీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, భావసారుప్యత కలిగిన వారితో కలిసి మహా కూటమిగా కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు.  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ఈ ప్రతిపాదన చేశారు.  2019 ఎన్నికల్లో గతంలో అనుసరించిన మహాకూటమి విధానం ద్వారానే బీజేపీని, మోడీని ఎదుర్కోగలమని  అభిప్రాయపడ్డారు.  కేంద్రంలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా   ప్రాంతీయ పార్టీలతో పొత్తుల ఉండాలని అప్పుడే  ... రాష్ట్రాల్లో బలపడగలుగుతామని వివరించారు.  ఇందుకోసం  2004 ఎన్నికల స్పూర్తితో యూపీఏ మిత్రపక్షాలన్ని మళ్లీ ఏకం కావాలని మణిశంకర్ అయ్యర్ పిలుపునిచ్చారు. అప్పట్లో సోనియాగాంధీ మిత్రపక్షాలను కలుపుకుపోయారని, ఇప్పుడు రాహుల్ ఆ బాధ్యతను తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటు కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరముందని సూచించారు.  


ఇక రెండో అంశంగా ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో మార్చుకోవడంపై నేతలు దృష్టి సారించారు. ఇప్పటి వరకు తాము అధికారం కోల్పోయిన రాష్ట్రాలన్ని  ప్రజా వ్యతిరేకత కారణంగానే జరిగందని విశ్లేషిస్తున్న కాంగ్రెస్ పెద్దలు  ... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై కూడా అదే స్ధాయిలో వ్యతిరేకత ఉందన్నారు.  మోదీ పాలనపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత వస్తోందని ..ఎన్నికల సమయానికి ఇది మరింత విస్తరించి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీన్ని ఓటు రూపంలో మలుచుకోవడంపై తమ భవితవ్యం ఆధారపడి ఉందని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.  గతంలో తాము మిత్రపక్షాలతో దుందుడుకుగా వ్యవహరించామన్నది సరికాదని .. పరిస్దితుల దృష్యా అలా చేయాల్సి వచ్చిందంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.  


దేశంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న యువతను పార్టీ వైపు తిప్పుకోవాల్సిన అవసరముందని పలువురు నేతలు సూచిస్తున్నారు. ఇందుకోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా తరహాలోనే కొత్త పథకాలకు రూపకల్పన చేయాలని .. ఉపాధి,ఉద్యోగాల కల్పనపై భరోసానివ్వాలని  చెబుతున్నారు.  దీంతో పాటు ప్రస్తుత పరిస్ధితుల్లో యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తే  ... పార్టీకి ప్రయోజనం చూకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు సూత్రాల ఆధారంగా పార్టీకి పునర్ వైభవంతో పాటు తమకు అధికారం దక్కుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: