దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లోనే అధ్వాన స్థితిలో ప‌డింది. త‌నంత‌ట తానుగా కోలు కునేలా కూడా క‌నిపించ‌డం లేదు. ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆ పార్టీలో మొదట కొట్టవచ్చినట్టుగా కనిపించేది, నిరాకరణ. అంటే తమ పార్టీని ఏదో దీర్ఘ కాలిక సమస్య పట్టి పీడిస్తోందనే దానిపట్ల అపనమ్మకం. రెండు కారణాల రీత్యా ఇది అర్థం చేసుకోగలిగినదే. ఒకటి, కేవలం 34 నెల ల క్రితమే కాంగ్రెస్‌ సంఖ్యాధిక్యత ను గలిగి దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా ఉండటం. 


వరుసగా పదేళ్లు కాంగ్రెస్‌ ప్రధాని అధికారంలో ఉండటం... 1970 లలోని ఇందిరా గాంధీ పాలన తదుపరి ఇదే మొదటిసారి. అలాంటి దశ ముగింపునకు వచ్చిం దంటే అది తాత్కాలికమైనదేనని, ఓటర్లు తిరిగి తమ పార్టీకి అనుకూలంగా మారు తారని అనుకోవడం సహజమే. ఇక రెండవ కారణం, కుటుంబ నియంత్రణలోని ఏ పార్టీలో నైనా ఉండే ఆశ్రిత వర్గం జనాదరణగల నేతలై ఉండరు. వారికి నాయక త్వానికి నిజాన్ని చెప్పడం వల్ల ఒరిగేదీ ఉండదు, పార్టీ శ్రేణులను సమీకరించాల్సిన బాధ్యతా ఉండదు. కాబట్టి, వారికి సైతం  క్షేత్ర స్థాయి వాస్తవికత తెలిసి ఉండదు.  

రెండు, తమదైన రాజకీయ కథనం అంటూ ఒకటి లేకపోవడమే సమస్య తప్ప, నాయకుడు లోపించడం కాదు. నిజమే, నరేంద్ర మోదీకి చాలా ఆకర్షణ శక్తి ఉంది. అది ఇతరులలో అంకితభావాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన గొప్ప ఉపన్యాసకు డని మనకందరికీ తెలుసు. అయితే, ఆయనకున్న ముఖ్య ప్రతిభ సూక్ష్మీకరణ. అంటే దేశం ఎదు ర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను సైతం అతిగా సరళీకరించిన చట్రంలోకి కుదించేయడం. ఉదాహరణకు, బల హీనమైన, పిరికి నాయకత్వం వల్లనే ఉగ్రవాదం పెచ్చరిల్లిందని, తాను దాన్ని తుదముట్టించేస్తానని ఆయన అంటారు. 

కానీ ఆయన ఆ పని చేయలేరనే వాస్తవం ఇప్పడు మనకు తెలిసింది. అయినా దానికి వ్యతిరేకమైన రాజకీయ కథనం ఏదీ లేదు. రాజకీయ చర్చ ఏ పరిధుల్లో, ఏ ప్రాతిపదికలపై సాగాలో కూడా మోదీ చాలా చక్కగా నిర్వచిం చగలుగుతారు. కాబట్టే దేశంలోని పౌరులందరిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపిన  పెద్ద నోట్ల రద్దును... నల్లధ నానికి, ఉగ్రవాదానికి, నకిలీ నోట్లకు వ్యతిరేకంగా సాధించిన గొప్ప విజయంగా చలామణీ చేయగలిగారు. బల మైన, ప్రభావశీలమైన రాజకీయ కథనాన్ని దేన్నీ అందించలేకపోవడమే రాహుల్‌ గాంధీ అతి పెద్ద వైఫల్యం. 

ఆయన బహిరంగ ఉపన్యాసాల్లోని నిస్తేజం, నిస్సత్తువ ద్వితీయ ప్రాధాన్యంగల బలహీనతలు మాత్రమే. కాంగ్రె స్‌ ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్‌లను మోదీ నీరుగారుస్తున్నా... వాటిని సొంతం చేసుకునే సామర్థ్యం సైతం ఆయనలో కొరవడింది. క్షేత్ర స్థాయి కార్యకర్తలు లేకపోవడం మూడో సమస్య. భారతీయ జనతా పార్టీకి క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. వారిలో చాలా మంది అంకితభావంగల వారు, అత్యున్నతస్థాయి ప్రేరణ గలవారు. కొన్నేళ్ల క్రితం వరకు వ్యక్తులను పరి చయం చేయడానికి ‘స్వాతంత్య్ర సమర యోధుడు’ అనే మాట మనకు వినిపిస్తుండేది. 

ఈ వ్యక్తులు కాంగ్రెస్‌ నేతృత్వంలో బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించినవారు. 1930లలో పుట్టిన వారు కాంగ్రెస్‌ పేరు స్వతంత్రంతో ముడిపడి ఉన్నందున నెహ్రూకు, ఆ తర్వాత ఇందిరా గాంధీకి తమ సేవలను అందించారు. 1980ల కల్లా ‘కాంగ్రెస్‌ కార్యకర్త’ అనే ఆ వ్యక్తి అదృశ్యం కావడం ప్రారంభమై, నేడు అస్తిత్వంలోనే లేకుండా పోయాడు. హిందుత్వ లేదా కమ్యూనిజంలాగా ఆ పార్టీకి ఏదైనా ఒక భావజాలం లేదు. ప్రత్యేకించి, దళితులలో మాయావతికి, ముస్లింలలో అసదుద్దీన్‌ ఒవైసీకి ఉన్నట్టు ఆ పార్టీకి విధేయమైన సామాజిక పునాది కూడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: