భారత దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది.  రేవ్ పార్టీల ముసుగులో యువత మత్తులో జూగుతూ తమను తామే మరిచిపోయి అసభ్యకరంగా మారుతూ డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోతున్నారు. డబ్బు సంపాదించడమే పరమావధిగా భావించిన కొంత మంది బడాబాబులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు.   ముఖ్యంగా ఇలాంటి పార్టీలో సెలబ్రెటీల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద వ్యాపారస్తుల పిల్లలు కావడం శోచనీయం.  తాజాగా విలాసవంతమైన భవనంలో గుట్టుగా సాగుతున్న రేవ్ పార్టీని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు రట్టు చేశారు.
Image result for rev parties
అసభ్యకర నృత్యాలు చేస్తున్న పలువురిని నాసిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంబంధీకులు ఉన్నట్టు సమాచారం. భవనం నుంచి కర్ణభేరీలు పగిలిపోయేలా సౌండ్ సిస్టంతో యువత రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తున్నారు.. ఇది భరించలేని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో బంగ్లాకు చేరుకున్న పోలీసులు లోపల జరుగుతున్నతతంగాన్ని చూసి షాక్ అయ్యారు.   అకస్మాత్తుగా పోలీసుల దాడితో అక్కడ ఉన్న యువతులు అటూ ఇటూ పరిగెత్తారు..పక్కనే ఉన్న ఓ రూమ్ లోకి వెళ్లిపోయారు.  అక్కడ కొంత మంది యువకులు అర్థనగ్నంగా ఉన్నారు.
Image result for rev parties in hyderabad
పోలీసుల దాడిలో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న యువతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారు మత్తు పదార్థాలు కూడా సేవించి ఉంటారన్న అనుమానంతో నిందితుల రక్త నమూనాలను సేకరించారు. నిర్వాహకులు ఆన్ లైన్ ద్వారా సంప్రదించి యువతులను పార్టీకి రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: