2019 ఎన్నికలు.. ఇంకా రెండేళ్లు ఉన్నా ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతున్నాయి ఈ ఎన్నికలు.. ఇప్పటికే ఓసారి సీఎం సీటును చేజార్చుకున్న వైఎస్ జగన్ ఈసారి కసిగా పోరాటం చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ ఎన్నికలు జగన్ కు జీవన్మరణ సమస్యే.. 2019లో సత్తా చాటకపోతే..ఇక వైసీపీ అనే పార్టీ బతకడం దాదాపు అసాధ్యం.


ఇటు టీడీపీ కూడా సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఇన్నాళ్లూ తెర వెనుక పాత్ర పోషిస్తూ వచ్చిన నారా లోకేశ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా మారి.. ఆ తర్వాత మంత్రి పదవి కూడా అందుకోడంతో ఆయనపై అంచనాలు పెరుగుతాయి. 2019 ఎన్నికలు లోకేశ్ సామర్థ్యానికి కూడా గీటురాయి వంటివే అవుతాయి. జగన్ వర్సెస్ లోకేశ్ అన్నట్టు మారిపోతుంది సీన్.


టగ్ ఆఫ్ వార్ గా సాగే ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డాల్సిన పసుపు దళం నారా బ్రహ్మణిని కూడా రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హెరిటేజ్ నిర్వహణ, ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహణ ద్వారా తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకుంటున్న బ్రహ్మణి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 



అయితే వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మలా కాకుండా తప్పకుండా గెలిచే సీటు మాత్రమే ఎంచుకోవాలన్నది లోకేశ్ అండ్ కో ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా పరిస్థితి ఎలా ఉన్నా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి ఎదురు ఉండే అవకాశం ఉండదు. అందుకే విజయవాడ నుంచి బ్రహ్మణిని బరిలో దింపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: