గత కొన్ని రోజుల నుంచి తమిళనాడు  రాజకీయాలు సంచలనాలకు నాంధిగా నిలుస్తుంది. మొన్నటి వరకు సీఎం సీటు కోసం శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం మద్య జోరుగా యుద్దం జరిగింది.  మొత్తానికి సీఎం సీటు మాత్రం శశికళ కు నమ్మిన బంటు అయిన పళని స్వామి కి దక్కింది.  ప్రస్తుతం ఆర్ .కె. నగర్ లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

 ఇక్కడ కూడా శశికళ వర్గం..పన్నీరు వర్గాని యుద్దం జరగుతుండగా జయలలిత మేనకోడలు దీప తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది.  ఇక తమిళనాడు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న ఎండీఎంకే అధినేత వైగో ని ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు.

2009లో దేశ స‌మైక్య‌త‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతున్న పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా ఆయ‌న‌కు చెన్నైలోని ఓ న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: