మొన్న ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు పెను మార్పులకు సంకేతాలు పలుకుతున్నాయి.  తాజాగా  స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు పోటీగా ధర్మనిర్ పేక్ష(సెక్యులర్) సేవక్ సంఘ్ (డీఎస్ఎస్) ఏర్పాటైంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ డిఎస్ఎస్ ను ఏర్పాటు చేశారు.
Image result for rss
సోమవారం పట్నాలో తన మద్దతుదారులతో చేపట్టిన డీఎస్సెస్‌ ర్యాలీలో పాల్గొన్న తేజ్‌ ప్రతాప్‌ డీఎస్సెస్‌ గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ హిందూ యువవాహిని పేరుతో హిందూత్వ భావజాలన్ని బీహార్‌లోకి ప్రవేపెట్టాలనుకుంటున్నారని దీన్ని డీఎస్సెస్‌ సమర్దవంతంగా అడ్డుకుంటదని తెలిపారు. డీఎస్సెస్‌ను శాంతి, స్నేహ‌బంధం పెంపొందించ‌డానికి ఏర్పాటుచేశామ‌ని తెలిపారు. యూపీ సీఎం ఏర్పాటుచేసిన హిందు యువ వాహినిలాంటి సంస్థ‌లు బీహార్‌లో అడుగుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని, వాటిని డీఎస్సెస్ అడ్డుకుంటుంద‌ని తేజ్ ప్ర‌తాప్ తెలిపారు.  
Image result for yogi adityanath
ఇది కేవలం ట్రయల్ మాత్రమేనని అసలు బొమ్మ ఇంకా బయటకు రావాల్సి ఉందని అన్నారు.  అయితే దీనిపై స్పందించిన  దీనిపై బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముందు తేజ్ ప్ర‌తాప్ ఆరెస్సెస్‌లో చేరి అది ఎలా ప‌నిచేస్తుందో చూడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అయితే సుశీల్‌కు తేజ్ ప్ర‌తాప్ కౌంటర్ ఇచ్చారు. స‌గం ప్యాంట్లు వేసుకొనే వారికి మెద‌డు కూడా స‌గ‌మే ఉంటుంద‌ని తేజ్ ప్ర‌తాప్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: