భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ...

కళ్యాణ వైభవం
దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రగిరి సీతారాముల కల్యాణ శోభతో వెలిగిపోయింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీడీడీ తరఫున ఈవో సాంబశివరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వేడుకలకు హాజరయ్యారు.



497 అడుగుల దిగువకు వెళ్దాం!


రాష్ట్ర సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటిని వాడుకునేందుకు కనీస మట్టానికి మరింత దిగువకు వెళ్లాలని తెలంగాణ యోచిస్తోంది. కృష్ణా జలాల్లో తన వాటా మేరకు వినియోగం పూర్తయినందున సాగర్‌లో ఇప్పటికే నిర్ణయిం చిన 503 అడుగుల కనీస నీటిమట్టాన్ని పక్కనపెట్టి 497 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకోవాలని భావిస్తోంది. శ్రీశైలంలోనూ ఇదే రీతిన మరింత దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశాన్ని తెరపైకి తెస్తోంది. దీనిపై కృష్ణా బోర్డుకు గురువారం (6వ తేదీన) లేఖ రాసే అవకాశం ఉంది.


ప్రభుత్వం నడపడమంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ కాదు..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలకు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. పండగ రోజైనా రాజకీయాలు మానుకోవాలని... ముఖ్యమంత్రికి అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారు. సీఎం ఆదేశాలను అధికారులు పాటిస్తారని ఆయన రోజాకు హితవు పలికారు. ప్రభుత్వాన్ని నడపడమంటే జబర్దస్త్ ప్రోగ్రాం కాదు... ఈ రోజైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించు అంటూ యరపతినేని చురకలంటిచారు.


సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్టు


ప్రేమ నిరాకరించిన అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వాట్సాప్‌ ద్వారా బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాళ్లకు పంపుతూ  వేధింపులకు గురిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతేడాది నుంచి గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నూకటి సురేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.


గ్రాండ్ గా ఐపీఎల్ 10 ప్రారంభం...


హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో ఓపెనింగ్‌ సెర్మనీ అదుర్స్‌ అనిపించింది. క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, గంగూలీల వామ్‌ వెల్‌ కమ్‌ తో మొదలైన ఆరంభ వేడుకలు.. బాలీవుడ్‌ భామ అమీ జాక్సన్‌ స్టెప్పులతో ఎండ్‌ అయ్యాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్లు కోహ్లీ, వార్నర్‌.. డప్పు వాయిద్యాలు, పులి వేషధారులు, లంబాడీల నృత్యాల మధ్య స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీ మిక్స్ డ్‌ సాంగ్స్‌ కు 300 మందికి పైగా డ్యాన్సర్లతో  అమీ జాక్సన్‌ ఇచ్చిన ప్రదర్శన ఓపెనింగ్‌ సెర్మనీకే హైలైట్‌గా నిలిచింది. అమీ జాక్సన్‌ స్టెప్పులకు స్టేడియం హోరెత్తింది.



మరింత సమాచారం తెలుసుకోండి: