Image result for diwakar travels accident dist collector behavior



అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ఉందా? అనేది పెద్ద ప్రశ్న. ప్రజలు ప్రమాదాలకు గురై సహాయం కోసం అల్లల్లాడుతు ఉంటే దానికి కారణమైన రవాణాశాఖ తమను తాము రక్షించుకునే ప్రయత్నములో మునిగిపోవటమే కాదు, వీలుంటే ప్రమాదానికి కారణ హేతువైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించే సేవలో తరించి పోతుంది. అధికార పార్టీ కూడా అసంధర్భంగా నెపం ప్రతిపక్షం పైన, దాని నాయకుని వైపు వేలు చూపుతూ ఆ నీడలో దోబూచు లాడుతూ కాలయాపన చేస్తున్నారు. 


Image result for diwakar travels accident dist collector behavior



పది మందికి పైగా బస్ ప్రమాదములో చనిపోతే, బస్ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని తప్పించటములో ప్రభుత్వ వ్యవస్థలు అంటే పోలీస్, వైద్య, ఆరోగ్య, రవాణా శాఖలు నిమగ్నమై ఉన్నాయి. దానికి ది గ్రేట్ జిల్ల కలక్టర్, పోలీసు వ్యవస్థ నిర్భయంగా నిస్సిగ్గుగా చేయూత నివ్వటం చూస్తూనే ఉన్నము. ప్రశ్నించినందుకు ప్రతిపక్షనేతను చెరసాల్లో వేసేశారు. నేరస్తులను వారి ని వదిలేయటానికి తెలుగుదేశం ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుంది. అలాగే నేరస్తులైన దివాకర్ ట్రావెల్స్ యాజమా న్యం రోడ్డుపై కొచ్చి ప్రశ్నించిన వాళ్ళను పచ్చి బూతులు తిడుతుంటే ఇదేమిటనే వారులేని పరిస్థితి. దీన్ని చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం కాదు ఇక్కడుంది అరాచక ఆటవిక రాజ్య పాలన నడుస్తున్నట్లుంది.



Image result for diwakar travels accident dist collector behavior



ముఖ్యమంత్రికి ఇసుమంతైనా చీమ కుట్టినట్లు లేదు. ఇప్పుడు మానవ హక్కుల కమీషణ్, న్యాయశాఖలే లేకుంటే రాష్ట్ర ప్రజల బ్రతుకు అధోగతే.  ఆంధ్రాలోని  కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు గ్రామం వద్ద ఫిబ్రవరి 28న జరిగిన దివాకర్‌ బస్సు ప్రమాదానికి సంబంధించి  —  జిల్లా కలెక్టర్, రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్, పోలీస్ శాఖ, దివాకర్‌ ట్రావెల్స్‌ యజమానులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ గురువారం నోటీసులు జారీ చేసింది. వారితో పాటు పెనుగంచిప్రోలు తహసీల్దారు, సబ్‌ ఇన్‌స్పెక్టర్, నందిగామ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లను శుక్రవారం స్వయంగా కమిషన్‌ ముందు హాజరు కావాలని ఆదేశించింది.


Image result for diwakar travels accident dist collector behavior


దివాకర్‌ బస్సు ప్రమాదంలో పది మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం ప్రజలందరికి తెలిసిందే. ఆ ఘటనపై విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది "తగరం కిరణ్‌బాబు" మానవ హక్కుల కమిషన్‌లో ఈ విషయమై పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.  మృతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ట్రావెల్స్‌ యజమాను ల నుంచి ఎలాంటి సహాయం ఇంతవరకు అందలేదని, ఆ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ముఖ్యంగాం జిల్లా  కలక్టర్ ఆల్మోస్ట్  రాజకీయవాదిగా ప్రవర్తించటం వైద్య అధికారులు బస్ యజమానులకు తగ్గట్లు వారికి మేలుచేసేలాగా  విధంగా ప్రవర్తించటం, క్షతగాత్రులను నిర్లక్ష్యం చేయటం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.



Image result for diwakar travels accident dist collector behavior




ప్రమాదానికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌ యజమానులు జె.సి.దివాకర్‌రెడ్డి ఎంపీగా, జె.సి.ప్రభాకర రెడ్డి ఎమ్మెల్యేగా అధికార టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని కిరణ్‌బాబు ఆరోపించారు. మృతులకు పోస్టుమార్టం నిర్వహించలేదన్న ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష నేత జగన్‌ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను చూసేందుకు వచ్చి అధికారులను ప్రశ్నించగా కలెక్టర్, ఆస్పత్రి వైద్యులు సరైన సమాధానం చెప్పకపోగా వాదనకు దిగారని ప్రస్తావించారు. మృతుల కు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. విచారణకు స్వీకరించిన కమిషన్‌ బాధ్యులకు నోటీసులు జారీ చేసింది.


Image result for diwakar travels accident dist collector behavior



ప్రజలను ఈ పరిస్థితుల్లో కూడా రక్షించి సహాయం అందించని ప్రభుత్వం రాజకీయాలు చేయటం సబబు కాదని- ప్రతిపక్షం అలాచేస్తే తాము సరిగ్గానే పనిచేస్తున్నామని ఋజువు చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ప్రజలు బాహాటంగానే చెపుతున్నారు. అమరావతి నగరం సాధారణ ప్రజలకు న్యాయం చేయదని అమరావతి అధర్మావతి అని కోటి గొంతుకలతో చెప్పొచ్చని అంటున్నారు.   


Image result for diwakar travels accident

మరింత సమాచారం తెలుసుకోండి: