సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబును చాణక్యుడుతో పోలుస్తారు. రాజకీయంగా ఎత్తులు వేయడంలో ఆయన దిట్ట. ఆయనకు రాజకీయం తప్ప మరో వ్యాపకం లేదు. మరో వ్యసనమూ లేదు. ఏడు పదుల వయసు మీదకు వస్తున్నా.. రోజులో 16 గంటలు నిరాటంకంగా పని చేయగలుగుతారు. అధికారులను పరుగులూ పెట్టిస్తారు. అదీ చంద్రబాబు మార్క్. 



అలాంటి చంద్రబాబు మంగళవారం సూపర్ గా చక్రం తిప్పారు. చక్రం తిప్పడమంటే రాజకీయ పరంగా ఎత్తులు వేయడం కాదండోయ్.. నిజంగానే చక్రం తిప్పారు. అంటే బస్సు చక్రమో, లారీ చక్రమో, కారు చక్రమో కాదు.. కుమ్మర్లు కుండలు చేసే చక్రాన్ని తిప్పారు. మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిత్రమైన విచిత్రం కెమేరాలకు చిక్కింది. 



జ్యోతి రావు పూలే అంటే ఇప్పుడు బీసీలకు అంబేద్కర్ వంటి ఐకాన్ గా మారిపోయారు. ఆయన జయంతిని ఇప్పుడు అన్ని పార్టీలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. నివాళులు అర్పించారు. అక్కడే కుమ్మరి చక్రాన్ని గిరగిరా తిప్పారు. బీసీల సదస్సులో పాల్గొన్నారు. 



బీసీలను మొదటి నుంచి ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశం పార్టీయే అన్న చంద్రబాబు.. పలువురు వికలాంగులకు చక్రాల కుర్చీలు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: