గత కొంత కాలంగా తమిళనాడులో ప్రతిరోజూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంది.  ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు సీఎం పీఠం కోసం  పన్నీర్ సెల్వం - శశికళ మద్య పెద్ద యుద్దమే జరిగింది.  అయితే ఈ ఇద్దరికీ కాకుండా శశికళ కు నమ్మిన బంటు అయిన పళని స్వామి సీఎంగా ఎన్నికైయ్యారు.  అయితే జయలలిత మరణంతో ఆర్.కె.నగర్ లో ఉప ఎన్నికలు జరాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.  తాజాగా తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  
Image result for తమిళనాడు రైతులు
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక  సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించింది.  గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Image result for తమిళనాడు రైతులు
రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు నిన్న ఒంటిపై రాతలతో తమ నిరసన తెలిపారు.  అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతాంగ భూములు కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో కెళ్ళాయి. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఇదే దుర్భర పరిస్థితి.
Image result for తమిళనాడు రైతులు
చాలా రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసినా పరిస్థితిలో మార్పు లేదు. దేశవ్యాప్తంగా అనేక రైతాంగ ఉద్యమాలు జరిగాయి. ఆయా సందర్భాల్లో సమస్యలపై చర్చలు, పరిష్కారాలు జరిగినా, సమస్యల మూలాలు మాత్రం అలానే ఉన్నాయి.  కాగా తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న అన్నదాతలు  కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్నరీతిలో  ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. రుణమాఫీపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రైతులు గురువారం అరగుండ్లుతో నిరసన తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: