Image result for aap party


అవినీతిని ఊడ్చేస్తాం ఊడ్చేస్తాం అంటూ ఒక పద్దతి పాడు లేకుండా, ఆర్ధిక క్రమశిక్షణ అనేదానికి అర్ధం లేకుండా పాలించ బడ్డ డిల్లీ రాష్ట్రం ఆప్ కు సొట్టలు పడ్డాయి. చీపురు మొద్దుబారి పోయింది. ఒకే ఒక చిన్న రాష్ట్రంలో లభించిన అధికారాన్ని అద్భుతంగా నడిపి ఉంటే భవిష్యత్తులో ఆప్ ఇతర రాష్ట్రాలకు క్రమంగా విస్తరించి ఉండేది. చరిత్రలేని వాళ్ళని రాజకీయ నాయకులను చేసి ఆంధ్ర ప్రదేశ్ లో నందమూరి తారక రామారావు దేశములోనే  ప్రభవించితే - చరిత్రహీనులని అధికారము లోకి తెచ్చి ఆం-ఆద్మి పార్టి అధినేత అరవింద్ కేజ్రివాల్ పార్టీని కాలగర్భములో సమాధి చేయబోతున్నారు. 



Image result for aap party


పంజాబ్‌ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ పై పోటీచేసేందుకు రాజౌరి గార్డెన్‌ ఆప్‌ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో దేశ రాజధాని హస్తినలోని "రాజౌరి గార్డెన్‌" నియోజకవర్గం ఉప ఎన్నికలో అధికార "ఆమ్‌ ఆద్మీ పార్టీ" (ఆప్‌) ఘోర పరాజయం తో ధారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 


Image result for aap party




తన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామా చేయడం తో జరిగిన ఈ  ఉప ఎన్నికల్లో  "చీపురు" పార్టీ దారుణంగా చివికి - చీకి పోయి - ధరావత్తు కూడా కోల్పోయి దిగజారి మూడోస్థానానికి పరిమితమైంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీమున్సిపల్‌ ఎన్నికలకు
"సెమీ-ఫైనల్‌" గా భావిస్తున్న ఈ ఉప ఎన్నిక సంగ్రామంలో బీజేపీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 



Image result for aap party



బీజేపీ అభ్యర్థి మన్‌జిందర్‌ సింగ్‌ సిస్రా భారీగా 14652 oaTla మెజారిటీతో - 51.99% ఓట్లతో అంటే 40602 ఓట్లు సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ 25950 (33.23%) ఓట్లు సాధించింది. ఇక డిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని  "ఆప్‌" అభ్యర్ధి హర్జీత్ సింగ్ కేవలం 10243 (13.12%) ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్‌ కూడా కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది. 



Image result for rajouri delhi by poll candidates



దీంతో ఈ ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు. ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినప్పటికీ, రానున్న ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని "ఆప్‌"  ధీమా వ్యక్తం  చేస్తున్నది


arvind kejriwal, mcd polls, delhi municipal elections. delhi civi polls, aap, aap government, aam aadmi party government, delhi aap, delhi government, delhi news, indian express, india news

మరింత సమాచారం తెలుసుకోండి: