తెలుగు దేశంలో కీలక భూమిక పోషించి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని మరళ తెలుగు దేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన నేత దేవినేని నెహ్రూ.  ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన కొత్తలో ఆయనకు విజయవాడ నుంచి అండదండగా ఉంటూ ఎన్నో సేవలు చేశారు.  అంతే కాదు అప్పట్లో టీడీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు నేహ్రూ.   ఇదే సమయంలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణతో మంచి సాన్నిహిత్యం సంపాదించాడు నెహ్రూ.
అయిదుసార్లు ఎమ్మెల్యే
 అప్పట్లో  ఎన్టీఆర్ చేతన్య రథాన్ని నడుపుతున్న నందమూరి హరికృష్ణ అప్పట్లో ప్రజల్లోకి వెళ్లాలంటే చైతన్య రథం ఉండేది ఎన్టీఆర్ కి ఆ రథాన్ని నడిపే డ్రైవర్ మరెవరో కాదు నందమూరి హరికృష్ణ.  ఆ సమయంలో దేవినేని నెహ్రూ, హరికృష్ణకు మంచి స్నేహబంధం ఏర్పడింది.  తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మృతి వార్త విని నందమూరి హరికృష్ణ కంటతడి పెట్టారు. నెహ్రూ సోమవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.  
పలువురి సంతాపం
ఈ విషయం తెలియగానే నందమూరి హరికృష్ణ షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆయన హుటాహుటిన నెహ్రూ భౌతికకాయం ఉన్న కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆక్కడ ఆయన మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. ఎన్టీఆర్ హయాం నుంచే తెలుగుదేశం పార్టీలో నెహ్రూ కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

Image result for chandrababu

చంద్రబాబు సంతాపం దేవినేని నెహ్రూ మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. నెహ్రూ ఆకస్మిక మృతి తనకు, పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: