ట్రిపుల్ తలాక్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడు సార్లు తలాక్ చెప్పేస్తే చాలు భార్యతో భర్తకు విడాకులు మంజూరు చేసే ముస్లిం చట్టాలను మార్చాల్సిందేనని బీజేపీ సర్కారు పట్టుదలగా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా పని చేస్తోంది. త్వరలో తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ కూడా ఎక్కడ అవకాశం వచ్చినా ఈ ట్రిపుల్ తలాక్ తీరును ఎండగడుతున్నారు. 

Image result for triple talaq
ఓవైపు దేశవ్యాప్తంగా ఈ ట్రిపుల్ తలాక్ పై చర్చ సాగుతున్నా.. ఇంకా ఆ దురాచారాన్ని కొందరు దుర్మార్గులు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతే కాదు.. చివరకు వాట్సప్ లోనూ తలాక్ చెప్పేసి వైవాహిక బంధాన్ని తెంచేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో తలాక్‌ విడాకుల ఘటన బయటపడింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన అమ్మాయి బాదర్‌ ఇబ్రహీమ్‌ కు టోలిచౌకికి చెందిన ముదస్సిర్‌ అహ్మద్‌ ఖాన్‌తో గతేడాది ఫిబ్రవరిలో పెళ్లయింది. 

Image result for triple talaq
వరుడు మహమ్మద్‌ సౌదీలో ఓ బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇరవై రోజులు కాపురం చేసిన అనంతరం ఉద్యోగం కోసం సౌదీకి వెల్లిపోయాడు. ఆ తరువాత ఆరు నెలల వరకూ తరచూ భార్య, అత్తామామలతో ఫోన్లో మాట్లాడేవాడు. ఉన్నట్టుండి.. గత సెప్టెంబర్‌ నెలలో తలాక్‌ తలాక్ తలాక్ అంటూ వాట్సప్‌లో బాదర్ ఇబ్రహీమ్ కు మెస్సేజ్‌ పెట్టేశాడు. 

Image result for triple talaq
తలాక్ మెస్సేజ్ తో షాక్ తిన్న ఇబ్రహీమ్‌ అత్తగారింటికి వెళ్తే.. అక్కడ అవమానమే మిగిలింది. కనీసం ఎందుకు తలాక్‌ చెప్పారనే కారణం కూడా చెప్పకుండా గెంటేశారు అత్తమామలు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ట్రిపుల్ తలాక్‌ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా కఠిన చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: