భారత దేశంలో ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారంటే..బార్డర్ లో సైనికులు కంటిమీదు కునుకు లేకుండా కాపలా కాయడం వల్లే అని ప్రతి ఒక్కరికీ తెలుసు.  అందుకే జై జవాన్ అంటూ వారి సేవలను కొనియాడుతుంటాం.  ఈ మద్య  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత దేశంలోకి చొచ్చుకు వచ్చి మన సైనికులను మట్టు పట్టారు. దీనికి బదులుగా మన సైనికులు ‘సర్జికల్ స్టైక్’ చేసి అక్కడి ఉగ్రవాదులను మట్టుపెట్టారు.  

అయితే గత సంవత్సరం బార్డర్ లో పని చేస్తున్న సైనికులకు సరిగా ఆహార పదార్థాలు అందజేయడం లేదని తేజ్ బహదూర్ యాదవ్... ఈ ఏడాది మొదట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  జవానులకు పెట్టే ఆహారం చాలా తక్కువ క్వాలిటీతో ఉంటుందని వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇది వైరల్ అయి... కొన్ని వేల మంది షేర్ చేశారు. ఆర్మీలో ఈ వీడియో సంచలనంగా మారింది. ఆ పిటిషన్ పై హైకోర్టు స్పందించిన పారామిలటరీ దళాలకు నోటీసులు జారీ చేసింది.

జవానులకు నాసిరకం ఆహారం పెడుతున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.  అలాగే జవాను వీడియో వైరల్ అయ్యాక బీఎస్ఎఫ్ చేపట్టిన చర్యల గురించి కూడా ప్రశ్నించింది. తేజ్ బహదూర్ యాదవ్ పెట్టిన పోస్టులపై ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించింది.  ఆ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను, బీఎస్ఎఫ్ ను ఆదేశించింది.

అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిల్ దాఖలైంది. ఆ పిటిషన్లో జవానులకు పెట్టే ఆహారాన్ని ఉన్నతాధికారులు రోజూ పర్యవేక్షించాలని కోరారు పిటిషన్ దారులు.తేజ్ బహదూర్ తీసిన వీడియోలు పెద్ద ప్రకంపనలనే సృష్టించాయి. కాగా  జవానును నేడు ఆర్మీ విధుల నుంచి తొలగించింది. బీఎస్ఎఫ్ లో ఉన్న నియమాలను బట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఆర్మీ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: