ఔను.. కొ్న్ని రోజుల్లో కడప జిల్లాలో జగన్ అడ్డా అయిన పులివెందులకు కూడా ఉప ఎన్నిక రాబోతోంది. అక్కడ ప్రతిపక్ష నేత జగన్ రాజీనామా చేస్తున్నాడు. దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అరక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు. అప్పుడు ఉప ఎన్నికల్లో మళ్లీ అక్కడ వైసీపీ తరపున జగన్ పోటీ చేస్తారు. అప్పుడు మొదలవుతుంది అసలైన రాజకీయం. 


త్వరలో పులివెందుల వేదికగా జగన్, టీడీపీ ఆశాకిరణం లోకేశ్ ముఖాముఖి ఎన్నికల్లో తలపడబోతున్నారు. జగన్ గర్వం అణిచేందుకు అక్కడ జగన్ పై నేరుగా లోకేశ్ బరిలో దిగబోతున్నాడు. ఇప్పటివరకూ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడని విమర్శలు ఎదుర్కొంటున్న లోకేశ్ నేరుగా జగన్ పైనే విజయం సాధించి తన సత్తా ఏంటో ఆంధ్రదేశం నలుమూలలకూ చాటబోతున్నాడు. 



ఏంటి ఇదంతా వాస్తవమేనా అనుకుంటున్నారా.. కావచ్చు.. వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్ కు ఇదే సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని.. అప్పుడు జగన్ పై లోకేశ్ పోటీకి దిగుతాడని సవాల్ విసిరారు. ఇంకా ఈ సవాల్ కు వైసీపీ నుంచి జవాబు రాలేదు. 



మరి వైసీపీ కూడా ఈ సవాల్ కు ఓకే అంటే మాత్రం ఏపీ రాజకీయం మహా రంజుగా మారిపోతుంది. ఐతే.. ఈ సవాల్ చేసింది బుద్దా వెంకన్న కాబట్టి వైసీపీ నేతలు అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ సవాళ్ల వ్యవహారం ముదిరితే మాత్రం ఏపీకి కాబోయే నాయకుడెవరో ఇట్టే తేలిపోతుంది. ఇప్పటికే మొదలైన 2019 ఎన్నికల సమరం మరింత హాట్ హాట్ గా సాగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: