తమిళనాడు లో ఇప్పుడు ఎక్కడ చూసినా శశికళ వర్గం గురించే మాట్లాడుకుంటున్నారు.  ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నెచ్చెలిగా ఉన్న శశికళ ఆమె మరణం తర్వాత సీఎం పదవి కోసం ఎన్నో పన్నాగాలు పన్నిన విషయం తెలిసిందే.  ఒకదశలో ఎమ్మెల్యేలను అందరినీ ఓ ఫామ్ హౌజ్ లో దాచిపెట్టి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.  దీనిపై పోలీసులు ఎంటర్ కావడం..ఆ సమయంలో శశికళకు అక్రమాస్తుల కేసులో జైలు శిక్షపడటంతో ఆమెకు నమ్మకంగా ఉన్న పళని స్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యేలా చేసింది.  
Image result for shashikala
ఇక ఆర్.కె.నగర్ లో ఉప ఎన్నికలు ఉన్న సమయంలో శశికళ బందువు  అయిన దినకరణ్ నియోజకర్గ ప్రజలకు డబ్బు ఎర చూపించాడని కోట్లు దుర్వినియోగం చేశారని ఈసికి తెలియడంతో ఎన్నికలు వాయిదా వేశారు.  కాగా త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే శశికళ వ‌ర్గానికి రెండాకుల గుర్తు కేటాయించాల‌ని కోరుతూ ఎన్నిక‌ల అధికారికి లంచం ఇవ్వ‌బోయాడ‌ ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది.  
Image result for dinakaran
ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్‌ అయిన  అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అయిదు రోజులు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ డీసీపీ మాట్లాడుతూ ఈ కేసులో దినకరన్‌ ప్రమేయంపై కావాల్సినన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే మరింత సమాచారం బయటకు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులో  దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: