ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అప్పట్లో పెను సంచలనాలకు నాంధి పలికారు.  తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయే ముందు కుడా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  మొత్తానికి తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ దాదాపు భూ స్థాపితం అయిన పరిస్థితికి వచ్చింది.  చాలా రోజులుగా మీడియా ముందుకు రాకుండా ఉన్నారు ఉండవల్లి.
babu-lokesh
 తాజాగా ఏపీ సీఎం తనయుడు చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ను పప్పు అనడంలో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.   లోకేష్ ను పప్పు అంటే తప్పేంటనీ?’ ఆయన ప్రశ్నించారు. అయితే తన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి.. కక్ష సాధింపు ధోరణితో లోకేష్ చర్యలకు ఆదేశిస్తుండటం ఆయన్ను మరింత విమర్శలపాలు చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Image result for nara lokesh
సోషల్ మీడియా పోస్టింగులపై అతిగా స్పందిస్తే.. అది చంద్రబాబు సర్కార్ కే నష్టమని చెప్పారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని సైతం పప్పు అంటూ కామెంట్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో  రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిలాగా మెరుగైన పాలనను జగన్ అందిస్తారని చెప్పుకొచ్చారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: