వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సీబీఐ కోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌​ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

జగన్ మీడియా సాక్షి టీవీలో వచ్చిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఉందని, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.  . జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

జగన్ తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. అంతేకాదు జగన్ విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతినిచ్చింది.  కోర్టు తీర్పు పట్ల వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. న్యాయస్థానంలో తమ పార్టీ అధినేతకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశాయి. తన న్యూజిలాండ్ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ ఇంతకుముందు కోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: