ఇది స్మార్ట్ ఫోన్ ల కాలం.. అవసరం ఏదైనా దాన్ని తీర్చే పరికరం మాత్రం స్మార్ట్ ఫోనే అన్నట్టు తయారైంది వ్యవస్థ. వార్తల దగ్గర నుంచి సినిమా టికెట్ల బుకింగ్ వరకూ.. నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల నుంచి విలాస వస్తువుల కొనుగోలు వరకూ అన్నీ లావాదేవీలు స్మార్ట్ ఫోన్లేనే జరిగిపోతున్నాయి. క్షణక్షణానికి అప్ డేట్ న్యూస్ వచ్చేస్తోంది. 


ఐతే..ఇంత జరుగుతున్నా దినపత్రికలకు ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదట. అంతేకాదు.. ఆ ఆదరణ ఇంకా పెరుగుతోందట. తాజాగా ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ లెక్కల ప్రకారం గత పదేళ్ల కాలంలో దిన పత్రికల యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపు 5 శాతంగా ఉంటోంది. టెలివిజన్‌, వెబ్‌సైట్‌, సోషల్ మీడియా వంటివి ఎన్ని ఉన్నా దినపత్రికలకు ఉన్న విశ్వసనీయతే ఇందుకు కారణం కావచ్చు. 

sakshi media logo hd కోసం చిత్ర ఫలితం
2006-16 మధ్య డెయిలీ న్యూస్ పేపర్ల వార్షిక వృద్ధి 4.87 శాతం పెరిగిందట. దేశంలో అన్ని దినపత్రికలు కలిపి 2006లో 3.91 కోట్ల  కాపీలు అమ్ముడయ్యాయట.
2016 ఆ సంఖ్య 6.28 కోట్లకు చేరుకున్నట్టు ఏబీసీ తాజాగా ప్రకటించింది. పదేళ్లలో దినపత్రికల సర్క్యులేషన్‌ 2.37 కోట్లు కాపీలు పెరిగిందన్నమాట.



ఇక తెలుగు పత్రికల విషయానికి వస్తే.. అవి సర్క్యులేషన్ పెరుగుదలలో దేశంలోనే అవి రెండో స్థానంలో ఉన్నాయి. హిందీ పత్రికల సర్క్యులేషన్‌ వృద్ధి 8.76 శాతంగా ఉంటే.. తెలుగు పత్రికలు 8.26 వృద్ధి రేటుతో రెండో స్థానంలో నిలిచాయి. వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఉన్నా సీరియస్ వార్తల విశ్లేషణ దినపత్రికల్లోనే ఉండటం కూడా వీటి విశ్వసనీయతకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: