తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి ఇది చాలా గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆయన స్థాయి ఇప్పుడు మరింతగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రంలో పాపులర్ నేతగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతల్లో కేసీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నేతగా రేవంత్ రెడ్డికి గుర్తింపు దక్కింది. 



బెంగళూరులోని పోలిటికల్ కొషియంట్ అనే సంస్థ చేసిన ఒక సర్వేలో ఈ విషయం వెలుగు చూసిందట. తెలంగాణలో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరు అని ప్రశ్నించగా.. దాదాపు 50 శాతం మంది కేసీఆర్ ను తమ పాపులర్ లీడర్ గా చెప్పారట. ఐతే.. కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ ఉన్న నేత మరొకరు లేకపోవడం విశేషం. కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ లేరు. 



గుడ్డిలో మెల్లగా.. రేవంత్ రెడ్డి కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నారు. కాకపోతే కేసీఆర్ కు 48 శాతం వరకూ మద్దతు పలికితే.. రేవంత్ రెడ్డికి ఓటేసిన వారు మాత్రం 20 శాతం లోపే ఉన్నారు. 19.6 శాతం మంది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని అనుకూలంగా చెప్పారు. వీరిద్దరి తర్వాత మిగిలిన వారంతా నామమాత్రపు మార్కులే తెచ్చుకున్నారు. 




కాంగ్రెస్ నేత జానారెడ్డి 11 శాతం ఓట్లు తెచ్చుకుంటే.. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేవలం 7 శాతం మాత్రమే ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారట. ఐతే ఇక్కడ ఓ విషయం గమనించాలి. టీఆర్ ఎస్ తరపున కేవలం కేసీఆర్ నే పరిగణనకు తీసుకున్నారు. అందువల్ల కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతలు బరిలోనే లేరు. ఏదేమైనా ఇది రేవంత్ రెడ్డికి మాత్రం గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: