హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించాడు. వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టి  ధ్వంసమైంది. ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ టీఎస్ 07 ఎస్ కే 7117 కావడంతో ప్రముఖుల కుమారులే ఆ కారులో ఉన్నారని అనుమానించగా...ఆ కారులో ఉన్నది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రవివర్మ ఉన్నట్టు గుర్తించారు. 



గాయపడిన ఇద్దరిని స్థానికులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రస్తుతం మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉన్నారు.  నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా గత ఏడాదే బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది.



కారు నెంబర్ టీఎస్ 07 ఎస్కే 7117 ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు...కారులో మరణించినది మంత్రి నారాయణ కుమారుడు అని తేలింది.  గత రెండు రోజులుగా ఆ కారు తెల్లవారు జామున అతివేగంగా దూసుకువచ్చేదని పోలీసులు వెల్లడించారు. కాగా, ఎంతో భవిష్యత్ ఉన్న నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: