Image result for gandhi national herald case


బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ఊరికే ఉండరు. ఎప్పుడూ ఏదో గెలుకుతూనే ఉంటారు. ఆయన వెలిగించిన అగ్గిపుల్ల భగ్గు మంటూ ప్రసిద్దిగాంచిన భారతీయ అమ్మా కొడుకులపై విచారణ కొనసాగించేవరకు దారి తీసింది.   


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె తనయుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్‌ హెరాల్డ్ కేసు సోనియా ఫ్యామిలీని వదల్లేదు. ఈ పేపర్ నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్‌‌ తో పాటు స్టాక్‌ హోల్డర్లను విచారించాలని ఐటీ శాఖను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. అంటే నేషనల్  సోనియా, రాహుల్ లను విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఆదాయ పన్ను శాఖను ఆదేశించిందన్న మాట. ఇదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడలు కూడా నిందితులుగా ఉన్నారు.
Image result for gandhi national herald case

నేషనల్ హెరాల్డ్ పత్రిక 2008లో మూతపడింది.  ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కు కాంగ్రెస్ పార్టీ 2010 లో రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని వసూలు చేసే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) కు కట్టబెట్టింది. ఈ తతంగంలో కాంగ్రెస్ పార్టీ నిధులు మళ్లించి మోసానికి పాల్పడిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే!

Image result for gandhi national herald case

నేషనల్ హెరాల్డ్ విషయంలో 2000 కోట్ల రూపాయిల దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి 2012 లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. అయితే కాగా, ఈ ఆదేశాలపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని రాహుల్ గాంధీ చెప్పారు.

Image result for gandhi national herald case

మరింత సమాచారం తెలుసుకోండి: