ఇటీవల చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సంగతి తెలిసిందే. తన అమెరికా పర్యటన జరిగిన తీరు.. తాను ఎన్ని కంపెనీల ప్రతినిధులను కలిసింది.. ఏ ఏ కంపెనీలు ఎలా స్పందించాయో అన్నీ వివరంగా చెప్పాలనుకున్నారు. సహజంగా చంద్రబాబు ప్రెస్ మీట్ అంటేనే విలేఖరులు జడుసుకునే పరిస్థితి ఉంది. ఆయన సాధారణ విషయాలకే సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెడుతుంటారు. 



ఇక ఇంతటి కీలకమైన అమెరికా పర్యటన మీద ప్రెస్ మీట్ అంటే ఇంకేమైనా ఉందా.. పాపం విలేఖరులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు కూడా వమ్ము చేయలేదు. సాయంత్రం ఐదున్నర గంటల సమయం దాటాకా ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు దాదాపు గంటన్నరసేపు తన అమెరికా పర్యటన గురించి వివరించారు. దాదాపు వారం రోజుల పర్యటన కాబట్టి చెప్పాల్సిన విశేషాలు కూడా చాలానే ఉంటాయి మరి. 



ఐతే.. దాదాపు గంట సేపు తన పర్యటన విశేషాలు వివరించిన చంద్రబాబు.. చివరకు వైఎస్ జగన్ ప్రధాని భేటీ విషయానికి వచ్చేసరికి కాస్త భయపడ్డారు. ఇప్పటివరకూ హైలెట్ చేసిన అమెరికా టూర్ సంగతి పక్కకు పెట్టి మీడియా ఇప్పుడు జగన్ పై తాను చేసే విమర్శలకే ప్రాధాన్యం ఇస్తుందేమోనని జంకారు. అదే విషయం మీడియా ముందు కూడా వెలిబుచ్చారు. 



జగన్ పై ఆరోపణల సంగతికి అంత ప్రయారిటీ ఇవ్వకండి. అమెరికా టూర్ విషయం పక్కకు పోతుంది. జగన్ ఇష్యూ కారణంగా దాన్ని డైల్యూట్ చేయకండి.. అని విలేకరులకు విజ్ఞపి చేసుకున్నారు. అయితే ఆ విజ్ఞప్తి చేసిన ఆయన జగన్ పై ఘాటుగా కామెంట్లు చేసేసరికి ఎప్పటిలాగానే మీడియా వాటికి ప్రాధాన్యం ఇవ్వకతప్పలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: