పెద్దనోట్ల రద్దు సహా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కారు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాజకీయ అవినీతికి ప్రధాన కారణమైన విరాళాలపై ఈసారి మోడీ గురి పెట్టారు. ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు వివిధ కార్పొరేట్ కంపెనీల నుంచి నగదు విరాళంగా తీసుకుంటున్నాయి. వీటికి సరైన లెక్కలు కూడా చెప్పడం లేదు. 



అలా విరాళాలు తీసుకోవడం వల్ల అధికారంలోకి వచ్చాక ఆయా కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది కూడా. ఇప్పుడు ఈ ధోరణి కళ్లెం వేయాలని మోడీ భావిస్తున్నారట. అందుకోసం విరాళాల ప్రక్రియను పారదర్శకంగా చేసేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్పోరేట్లు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఇక బాండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుందట. 



ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు బయటపెట్టారు. రాజకీయ విరాళాల ముసుగులో హవాలా వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకువస్తోందని చంద్రబాబు నాయుడు చెప్పారు. కార్పోరేట్లు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఇక బాండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని.. దీనిపై మోడీ తనను అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరారని చంద్రబాబు చెప్పారు. 


Related image

ఈ కొత్త నిర్ణయం ప్రకారం రాజకీయ పార్టీలన్నీ విరాళాలను ఇక బాండ్ల రూపంలోనే స్వీకరించాల్సి ఉంటుందని.. ఆన్ లైన్లోనే లావాదేవీలు చేపట్టాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దీని ద్వారా రాజకీయాలు భ్రష్టు పట్టకుండా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. విరాళాల ముసుగులోజరుగుతున్న సూట్ కేసు కంపెనీలు, హవాలా వ్యాపారాలను నియంత్రించేందుకు వీలుంటుందని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: