దేశంలోనే తాను కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నానంటున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పటికే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్, ఫైబర్ గ్రిడ్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న తాను..ఇకపై దేశంలో సరికొత్త విప్లవం సృష్టించబోతున్నట్టు చెబుతున్నారు. సౌర విద్యుత్ ను నిల్వచేయటం అనే ప్రక్రియతో  దేశంలోని విద్యుత్  రంగంలో రెండో అతిపెద్ద సంస్కరణలను తీసుకువస్తున్నానంటున్నారు. 



అమెరికా పర్యటనలో విద్యుత్ ను నిల్వచేసే ప్రక్రియను కనిపెట్టిన టెస్లా సంస్థతో ఒప్పందం కుదిరిందని చంద్రబాబు అన్నారు. విద్యుత్ నిల్వ సాంకేతికత కారణంగా రాష్ట్రంలో కొత్త జల, ధర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై పునరాలోచనలో పడ్డామని సీఎం వ్యాఖ్యానించారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు  విషయంలోనూ మరోమారు ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. 

solar power plant కోసం చిత్ర ఫలితం

ఆంధ్రప్రదేశ్ నుంచే రెండో విద్యుత్ సంస్కరణల విప్లవం ఆరంభమవుతుందని చంద్రబాబు అంటున్నారు. సౌర, పవన  విద్యుత్ లను ఉత్పత్తి చేయటంతో పాటు దాన్ని నిల్వచేసేందుకు ఓ సరికొత్త సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా సంస్థ రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

solar power plant కోసం చిత్ర ఫలితం

టెస్లా సంస్థ ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని రెండు చోట్ల 8 మెగావాట్ల విద్యుత్ నిల్వ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. సౌర, పవన విద్యుత్ రంగాల్లో ఇప్పటికే 4వేల 600 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్న ఏపీ.. వాటిని నిల్వచేయటంతో పాటు గ్రిడ్ కు అనుసంధానించేలా కార్యాచరణ  చేస్తున్నట్టు వెల్లడించారు. నిల్వ చేసిన విద్యుత్ ధర ప్రస్తుతం 8 రూపాయలుగా ఉందని.. అయితే వీలైనంత మార్కెట్ ను సృష్టించటం ద్వారా వివిధ కంపెనీలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించి ఆ ధరను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: