తెలుగు పాప్యులర్ టీవీ కార్యక్రమాలు జబర్దస్త్, పటాస్‌ల‌పై ప‌లు అభ్యంత‌రాలు చెబుతూ హైద‌రాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశారు. ఆ కార్య‌క్ర‌మాల్లో పంచ్‌లు, సెటైర్ల కోసం వాడుతున్న ప‌ద‌జాలం బాగోలేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ విషయాలపై టీవీ యాజమాన్యం కానీ ప్రోగ్రామ్ డైరక్టర్ కానీ సెన్సార్ చేయటం లేదని.. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని నందనం దివాకర్ డిమాండ్ చేశారు.



మ‌రోవైపు ఎమ్మెల్యే రోజా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంలో మహిళలను, చిన్న పిల్లలను కించపరిచే కార్యక్రమాలను ప్రోత్సహించడం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ఎమ్మెల్యే రోజాపై.. దివాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన హోదాలో ఉన్న రోజా ఓ ఛానల్‌లో మహిళలను కించపర్చేవిధంగా ప్రసారమవుతున్న కార్యక్రమంలో పాల్గొనడం సరికాదన్నారు.


Image result for patas jabardasth

ఒక‌రిని తిడుతోంటే మ‌రొక‌రు ఆనందించ‌డ‌మేంట‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాస్తవానికి మాట్లాడుకుంటే జబర్దస్త్, పటాస్ ప్రోగ్రామ్స్ కి రేటింగ్ ప్రధానంగా యువత ద్వారానే వస్తుంది. యువతని ఆకర్షించాలంటే మాత్రం పంచ్ డైలాగ్ లు పక్కా అవసరం. కానీ ఈ రెండు ప్రోగ్రాములలో వచ్చే పంచ్ డైలాగ్ లలో డబుల్ మీనింగ్ డైలాగ్ పక్కా వస్తుంది. అలా రాకపోతే ప్రోగ్రాం కచ్చితంగా ఫ్లాప్ అవుతుందేమో అన్న భయం ప్రోగ్రాం ప్రొడ్యుసర్ లకు పట్టుకుంది కానీ ఇలాంటి మీనింగ్ ద్వారా సమాజిక సంబాదాలకు మచ్చ కలుగు తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: