పరిపాలన ఎలా ఉంది అనేది ఎవరిని అడిగితే తెలుస్తుంది. ప్రజలను అడిగితే తెలుస్తుంది. అలాగే పాలకుల విషయం లో అంతిమ అధికారం కూడా ప్రజలదే, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంలో ప్రజల హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే ఏ నాయకుడైనా ప్రాజా నిర్ణయానికే పెద్ద పీట వేస్తే ఆ నాయకుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. సరిగ్గా ఇలాంటి పంథాలోనే పయనించాలని కోరుకుంటున్నారు చంద్రబాబు.


Image result for chandrababu

ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో మంత్రులు,ఎమ్మెల్యేలు వైఫల్యం చెందారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్ని చేసినా పార్టీకి ఓట్లు వేయకపోతే ఏం లాభమని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.


Image result for chandrababu

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు విషయమై ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా టిక్కెట్ల కేటాయించనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.2014 ఎన్నికల సమయంలో కూడ చంద్రబాబునాయుడు ఐవిఆర్ఎస్ ద్వారా టిక్కెట్లను కేటాయించారు. అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబునాయుడు ఈ సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించారు. అయితే రానున్న ఎన్నికల్లో కూడ ఇదే తరహాలోనే టిక్కెట్లను కేటాయించనున్నట్టు బాబు చెప్పారు.


Image result for chandrababu

డబ్బున్నవాళ్ళంతా సుఖంగా ఉండరని బాబు చెప్పారు. అయితే తృప్తిగా ఉన్నవారే జీవితంలో సుఖంగా ఉంటారని బాబు చెప్పారు. అందుకే అసెంబ్లీలో చెప్పిన మాటను ఆయన మరోసారి బాబు చెప్పారు.ఆరు రకాల అ, ఆ లు గురించి చంద్రబాబునాయుడు మరోసారి టిడిఎల్పీ సమావేశంలో చెప్పారు. అ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం, అ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్,ఆ అంటే ఆరోగ్యమని బాబు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: