రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో ఉత్పత్తి పెరుగుతున్నా అదే సమయంలో గణనీయంగా పెరుగుతున్న సరఫరా డిమాండ్ ను అధికమించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తుంది. ప్రతిఏటా పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉడటం అలవాటుగా మారింది. ఒక సంవత్సరం సకాలంలో వర్షాలు పడకపోవటం లేదా కొంత ఆలస్యం జరగడంతో ప్రభుత్వం హడావిడి మొదలవుతుంది. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీజెన్ కో ఉత్పత్తిలో అగ్రభాగాన నిలిచినట్లు ప్లాంటేలిక్ ఫ్యాక్టరీ అంశాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రాజెక్టులు కూడా మొదటిస్థానంలో ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల ఉత్పత్తి పరిస్థితిని పరిశీలిస్తే థర్మల్ విద్యుత్ 2007-08 లో 21682 మిలియన్ యూనిట్లు, 2008-09 లో 23326, 2009- 10-11లో 26927, 2011-12 లో 32981 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది.   జలవిద్యుత్ విషయానికొస్తే 2007- 08లో 9500 మిలియన్ యూనిట్లు, 2008- 09లో 785, 2009- 10లో 5512, 2010- 11లో 7822, 2011-12 లో 6522 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించడమైంది. అందులో జెన్ కో ఉత్పత్తి చేసింది. 2007- 08లో 31182 మిలియన్ యూనిట్లు, 2008- 09 31111, 2009- 10లో 29691, 2010-11 లో 34749, 2011-12లో 39237 మిలియన్ యూనిట్లకు చేరింది ఇదికాకుండా కేంధ్ర ఉత్పత్తి సంస్థల నుంచి రాష్ట్రం వాటా ఎన్టీపీసీ సింహాద్రి, విజ్ఞేశ్వరం క్యాస్టిక్, బయట నుంచి కొన్న విద్యుత్, ప్రైవేట్ రంగం ఇతరాలన్నింటినీ కలిపితే మొత్తం 2007- 08 లో 62135 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.  అలాగే 2008-09 లో 67622, 2009-10 74858, 2010-11 77901,, 2011- 12లో 85868 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించాయి. అయితే అదేసమయంలో డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2007-08లో 63629 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా అది క్రమంగా2008-09 లో 3134, 2009-10 లో 1903, 2011-12లో 5795 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. ఆ గణాంకాలను పరిశీలిస్తే గడిచిన ఐదు సంవత్సరాలుగా విద్యుత్ ఉత్పత్తి పెరిగినప్పటికీ అదేసమయంలో డిమాండ్ కూడా పెరిగింది. ఇలా పెరిగిన డిమాండ్ ను అధికమించటానికి ప్రత్నామ్నాయ చర్యలేవి ముందుచూపుతో ప్రభుత్వం చేపట్టలేదని, దాని ఫలితంగా లోటు కూడా పెరిగినట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: