ఏపీ సీఎం అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రోజు మీడియా అంతా ఢిల్లీలో మకాం వేసింది. కనీసం మీడియాలో రోజూ అరగంటైనా కనిపించడం చంద్రబాబు స్పెషాలిటీ.. అమెరికా పర్యటన వివరాలు కూడా చెబుతారు కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువ సేపు మాట్లాడతారని అంతా ఊహించారు. కానీ విచిత్రంగా చంద్రబాబు అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నా ప్రెస్ మీట్ లేదు. 



కనీసం విజయవాడ అయినా వచ్చారా అదీ లేదు.. అరె బాబు ఏమయ్యారు.. ప్రెస్ మీట్ ఉందా లేదా.. బాబు ప్రస్తుతం ఎక్కడున్నారు.. ఇలాంటి ప్రశ్నలకు ఢిల్లీలో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. మొత్తానికి ఆరోజు చంద్రబాబు దాదాపు 7 గంటలపాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. మరి ఆయన అంత సేపు ఎక్కడికి వెళ్లారు. ఈ అనుమానం అందరికీ వస్తుంది. 



దీన్ని కవర్ చేసే పని ఎల్లో మీడియా చేసింది.. చంద్రబాబు ఆ సమయాన్ని కూడా పెట్టుబడుల వేటకే కేటాయించారని.. కానీ కొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఓ అవగాహనకు రాకుండానే వివరాలను వెళ్లడించకూడదని షరతులు విధించాయని బిల్డప్ ఇస్తున్నాయి. ఒకవేళ ఆ వివరాలు బయటకు తెలిస్తే తమ కంపెనీల షేర్ల విలువలు, ఇతర అంశాలపై ప్రబావం ఉండే అవకాశం ఉందని ఆయా కంపెనీలు ఏపీ ప్రభుత్వానికి వివరించినట్టు కవర్ చేస్తున్నాయి. 



కానీ ప్రధాని మోడీని వైసీపీ అధినేత జగన్ కలిసిన నేపథ్యంలో కలవరానికి గురైన చంద్రబాబు.. ఢిల్లీలోని ఓ ఆంధ్రా ప్రముఖుడి నివాసానికి వెళ్లారని.. అక్కడ మరో ఇధ్దరు ప్రముఖులతో ఏకాంతంగా చర్చించారని ప్రజాశక్తి పత్రిక రాసింది. ఢిల్లీ పెద్దలతో రహస్య భేటీ ప్రధానంగా ఓటుకు నోటు కేసు మీదే జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఓటుకు నోటు కేసులో 2 నెలల క్రితం సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టుకు సెలవులు ముగిసిన అనంతరం ఈ కేసుపై మళ్ళీ విచారణ ప్రారంభమౌతుంది.



ఈ నేపథ్యంలో దీంతో తనపై ఎప్పుడైనా మోడీ కేసులపై విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని భావించిన చంద్రబాబు హుటాహుటిన ప్రముఖులను దర్శించుకొన్నారు. దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయాలని, కేసులు నుంచి బయట పడాలని, అందుకు ఏరకమైన చర్యలు తీసుకోవాలో వారితో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ప్రజాశక్తి రాసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: