జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రతి నియోజకవర్గం నుండి తన అభ్యర్థిని బరిలోకి దింపుతున్నానని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ ఎప్పటినుంచో తాను అనంతపురం జిల్లా నుండి బరిలోకి దిగుతున్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ నియోజకవర్గం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, కదిరి నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు చెబుతున్నారు.



అలాగే, గుంతకల్లు నియోజకవర్గంపైనా పవన్ దృష్టి ఉందని తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండటంతో, ఆయా నియోజకవర్గాలపైనే జన సేనాని దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ ఎంపిక‌ల్లో యువ‌త ఉత్స‌హంగా పాల్గొంటున్నార‌ని, పార్టీ సేవల కోసం అర్హుల‌ను ఎంపిక చేస్తామ‌ని అన్నారు. త‌మ‌కు అందిన అన్ని ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు.


Image result for pawan janasena

విజ‌య న‌గ‌రం నుంచి జ‌న‌సేన‌కు వ‌చ్చిన ద‌రఖాస్తుల వివ‌రాల‌ను ప‌వ‌న్ వెల్ల‌డిస్తూ.. మొత్తం 2 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఈ నెల 20, 21న విజ‌యన‌గ‌రంలోనూ జ‌న‌సేన శిబిరం ఉంటుంద‌ని తెలిపారు. కాగా, శ్రీకాకుళం, విశాఖపట్నం, గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన శిబిరాల గురించి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: