ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ కు తాను రూ.2కోట్ల మొత్తాన్ని ఇచ్చిన మాట వాస్తవమేనని వెల్లడించారు ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త శర్మ. అయితే.. తాను లంచం రూపంలో ఆ మొత్తాన్ని ఇవ్వలేదని.. పార్టీకి విరాళంగా మాత్రమే ఇచ్చినట్లుగా ప్రకటించారు. 2014 మార్చి 31న డీడీ రూపంలో ఆ మొత్తాన్ని తాను ఇచ్చానని.. ఆ విషయం కపిల్ మిశ్రాతో పాటు ఆప్ పార్టీకి చెందిన కీలక నేతలందరికి తెలుసన్నారు. కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కపిల్ మిశ్రా చెప్పినట్లుగా రూ.2 కోట్ల మొత్తం అయితే కేజ్రీవాల్ చేతికి వచ్చిన విషయం నిజమని తేలింది. అయితే.. అది లంచం రూపంలోనా? లేక.. విరాళం రూపంలోనా? అన్నది తేలాల్సి ఉంది. అయినా.. ఒక పార్టీకి ఒక పారిశ్రామికవేత్త రూ.2కోట్ల భారీ మొత్తాన్ని విరాళం రూపంలో ఇవ్వటంలో మర్మమేందంటారు?


మరింత సమాచారం తెలుసుకోండి: