వార్షిక సభ పేరిట రాజమండ్రిలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన సభ కేవలం ఆయన నోరు పారేసుకునేందుకే పనికి వచ్చింది. తన ఉపన్యాసం ప్రారంభంలో కెసిఆర్, తదితరులపైనా, తరువాత చంద్రబాబుపైనా, ఆఖరుకు జగన్ పైనా ఆయన తన చిత్తానికి చెలరేగిపోయారు. జగన్ పై తెలుగుదేశం వారు కూడా ఈ మేరకు చెలరేగి వుండరు.
మరోపక్క అదే సమయంలో సోనియా కుటుంబ భజనను కూడా ఉండవల్లి విస్మరించలేదు విమర్శల సంగతి అలావుంచితే, ఎంపీలు తమ నియోజకవర్గాల నిధుల నుంచి కూడా ఎలా లాభం పొందొచ్చో వివరించి, వారి పరువు తీసారు. ఇలా ఇష్టం వచ్చినట్లు, లెక్కలు, రుజువులు చూపించి మాట్లాడిన ఉండవల్లి, ఇదే వాదనను ఢిల్లీలో వినిపించి తెలంగాణా ఏర్పాటును అడ్డుకోవచ్చుగా అన్న గుసగుసలు వినిపించాయి
ఇన్ని విషయాలు తెలిసిన ఉండవల్లి వాటిని సోనియాకు నివేదించకుండా, ఇన్నాళ్లూ ఊరుకుని, ఇప్పుడు కేసిఆర్ మౌనంగా వున్నవేళ, విరుచుకుపడడం ఎందుకో? దీని వెనుక సమైక్య జనుల్లో తన స్టామినా పెంచుకుని, తానేమీ చేయలేదన్న అపప్రధను తప్పించుకోవడానికి తప్ప మరెందుకు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: