ఈ మద్య చిన్న పిల్లలు చేస్తున్న పనులు చూస్తుంటే..చాలా ముచ్చట వేస్తుంది.  ముఖ్యంగా సోషల్ మీడియాలో చిన్నారులు చేస్తున్న వింత పనులు వైరల్ అయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.  తాజాగా ఓ చిన్నారి చేసిన పనికి తండ్రి తో పాటు విన్న మనం కూడా షాక్ తినే పరిస్థితి ఏర్పడుతుంది.  ఇంతకీ ఆ బుడ్డోడు ఏం చేశాడో తెలుసా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  50 వేల యువాన్లు మన కరెన్సీలో 4,70,000 రూపాయ‌ల‌ నగదును చించి అవతల పడేశాడు.    చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

గావ్ అనే వ్యక్తి త‌న ఐదేళ్ల కుమారుడు నగదునంతా చించేయ‌డం చూసి ఆ చినిగిన డ‌బ్బుని తీసుకొని బ్యాంకుకు ప‌రుగులు తీశాడు. మొత్తం 50 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో 4,70,000 రూపాయ‌ల‌ నగదును త‌న కొడుకు ఇంట్లో ఆడుకుంటూ చించేశాడ‌ని చెప్పాడు. దానిని ఎక్స్చేంజ్ చేయ‌మ‌ని కోరాడు. అయితే ఆ తండ్రి అభ్యర్థన బ్యాంకు వారు అంగీకరించలేదు.

 అయితే, అందులో ఎన్నో నోట్లు నెంబ‌ర్లు కూడా క‌నిపించ‌కుండా చిరిగిపోవ‌డంతో వాటిని తీసుకోబోమ‌ని బ్యాంకు సిబ్బంది చెప్పారు. వ్యాపారం చేయ‌డం కోసం క్రెడిటర్ల దగ్గర్నుంచి తీసుకున్న ఆ న‌గదును ఇంట్లో ఉంచుకున్న ఆ వ్య‌క్తికి ఇప్పుడు ఆ డ‌బ్బు చెల్లకుండా పోయింది. ఇందులో తన కొడుకు త‌ప్పు ఏమీలేద‌ని, తెలియ‌నిత‌నంతోనే ఆ డ‌బ్బంతా చించేశాడ‌ని గావ్ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: