తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్కో మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటివరకూ చెల్లించాల్సిన 3 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే.. మే 31 నుంచి కరంట్ సప్లయ్ ఆపేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు ఏపీ జెన్కో నోటీసులు పంపింది. నోటీసును ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, విద్యుత్ కు సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వం, బెంగుళూరులోని దక్షిణ ప్రాంత విద్యుత్ కమీటీకి కూడా పంపారు. 

Image result for ap genco

ఏపిజెన్ కో నుంచి తీసుకుంటున్న విద్యుత్ కు తెలంగాణ డిస్కమ్స్ నామమాత్రంగానే డబ్బులు ఇస్తున్నాయని ఏపీ జెన్కో అంటోంది. గత నెలలో కేవలం 50 కోట్ల రూపాయలు ఇచ్చారని, ఈ నెలలో అది కూడా లేదని చెబుతోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం 60 రోజుల్లోపలే డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపింది.  తెలంగాణ డిస్కమ్స్ ఇప్పటివరకూ ఏపి జెన్కోకు మొత్తం 3138 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయని ఏపీ జెన్కో అంటోంది. 

Image result for ts DISCOMS

ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది. సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు అందుకుంటున్న ఏపీ జెన్కో మాత్రం ఆ బకాయలు పూర్తిగా చెల్లించడం లేదు. ఈ విషయంలో మాత్రం సింగరేణి కాలరీస్ ఏమాత్రం తగ్గకుండా బొగ్గు సరఫరా తగ్గించేసిందట. అందువల్ల ఈ రెండు వ్యవహారాలను సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదని ఏపీ జెన్కో అదికారులు చెబుతున్నారు. మరి తెలంగాణ ఎలా స్పందిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: