అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా చూసే ఉంటారు. అందులో ఒక్క రోజు ముఖ్యమంత్రి గా ఉన్న అర్జున్ అవినీతి అధికారుల భరతం పడతారు. అప్పటికప్పుడే వారిపై చర్య తీసుకుంటుంటారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అవినీతి అధికారులకు అదే సినిమా చూపిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అధికారుల అవినీతిపై చర్యలు తీసుకుంటున్నారు. 

Related image

ప్రజలే ముందు.. అనే కాన్సెప్టుతో ఏపీ సర్కారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందట. అవినీతి అధికారుల నుంచి వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయట. వాటి ఆధారంగా అవినీతి అధికారులు తీసుకున్న లంచాన్ని మళ్లీ బాధితులకు ఇప్పిస్తున్నారట. ప్రభుత్వం కొత్తగా  తీసుకున్న ఈ కాన్సెప్టు చాలా బాగా ప్రభావం చూపుతోందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 

Image result for AP GOVT 1100 TOLL FREE

1100 కాల్ సెంటర్ ప్రభావవంతమైన అస్త్రంగా పరకాల అభివర్ణించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని, లంచగొండుల గుట్టు బయటపెట్టాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరుతున్నందున అందరూ ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కాల్ సెంటర్ పనితీరు గురించి చేసిన సమీక్షా వివరాలను పరకాల వెల్లడించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు, ఇంకెవరైనా, ఎక్కడైనా అవినీతి జరిగితే కాల్ సెంటర్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: