కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  జైపాల్ రెడ్డి  తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ అనవసరమైన పథకాలు, వ్యూహాలతో తెలంగాణ ఖజానాను ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అలవికాని హామీలను గుప్పిస్తూ ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

Image result for kcr
ధనిక రాష్ట్రం అన్న కారణంతో కేసీఆర్ డబ్బు దుబారా చేస్తున్నారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలన్న కేసీఆర్ ప్రతిపాదనను జైపాల్ రెడ్డి తప్పుబట్టారు. ఓవైపు సెక్రటేరియట్ కూడా లేదని ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడుస్తుంటే... ఉన్న సచివాలయాన్ని కూల్చేందుకు కేసీఆర్ ఉత్సాహపడుతున్నారని మండిపడ్డారు. 

Image result for s jaipal reddy

ఇప్పుడు తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ వల్ల ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. కమీషన్ల కోసం చేసే ఇలాంటి పనులతో కేసీఆర్ పండగ చేసుకుంటున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు. పనిలో పనిగా ఆయన మోడీ సర్కారుపైనా మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో జనజీవనం అతలాకుతలమైందన్న జైపాల్ రెడ్డి.. అలాంటి తలతిక్క నిర్ణయాలతో ప్రజలను బాధించే అధికారం ఏ ప్రధానికీ లేదన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: