దేశ ఆర్థిక వ్యవస్థలోనే అతి పెద్ద సంస్కరణగా చెప్పుకుంటున్న జీఎస్టీ వచ్చే నెల నుంచి అమలుకాబోతోంది. జూలై 1 నుంచి వస్తు,సేవల పన్ను జీఎస్టీ అమలుకాబోతోంది. జీఎస్టీ కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం వివిధ వస్తువుల పన్ను రేట్లను ఖరారు చేసేపనిలో ఉంది. ఇందులో ప్రధానంగా బంగారంపై పన్నును ఖరారు చేసేసింది. 

Image result for gst goods

ఇప్పటివరకూ ఒక్క శాతంగా ఉన్నబంగారంపై పన్నును ఇప్పుడు మూడు శాతంగా మార్చింది. చెప్పులు, దుస్తులు, బిస్కెట్లపై భారీగా పన్ను విధించింది. జూలై1 నాటి నుంచి మలు చేసే కొత్త పన్ను విధానానికి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇక పన్ను వివరాలు పరిశీలిస్తే... సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరూ వాడే బిస్కెట్లపై ఏకంగా 18శాతం పన్ను విధించారు. 

Image result for gst goods

అలాగే సామాన్యులు తాగే బీడీలపై 28 శాతం పన్నుతో అదరగొట్టేశారు. ఇక రెడీమేడ్‌ దుస్తులపై 12 శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం ఉంటుంది. ఐతే.. రూ.500లోపు ఉన్న పాదరక్షలపై మాత్రం పన్ను 5 శాతానికి తగ్గించారు. కానీ వీటి ధర 500 దాటితే మాత్రం  18 శాతం పన్ను మోత మోగిపోతుందండోయ్. వీటి పన్నుల నిర్ణయంతో దాదాపు 90 శాతంపైగా వస్తువుల రేట్లు ఖరారైనట్టే. 

Image result for gst goods

కానీ ఈ జీఎస్టీ పన్ను ఖరారుపై దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్ల రంగం బాగా నిరసన తెలుపుతోంది. వినోదరంగంపై కూడా పన్ను భారం ఎక్కువవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కార్లు, ఆయుర్వేద ఉత్పత్తులపై పన్ను రేట్లను మళ్లీ సమీక్షించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. వికలాంగుల పరికరాలను జీఎస్టీ మినహాయించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: