పెళ్లి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి వారి వారి కేటగిరీలను బట్టి వారి వారి సంస్కృతులు అన్నింటికంటే ముఖ్యంగా పెళ్లి అంటే అందరూ చూపు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుపైనే ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. మరి అలాంటిది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వారు ఇంకా ఎలా రెడీ అవ్వాలి చెప్పండి..? ఎంత సాంప్రదాయ బద్ధంగా ఉండాలో వేరే చెప్పనక్కర్లేదు.  


short-dress

నిండుగా దుస్తులు ధరించి పెళ్లిచేసుకోవాల్సిన వధువు ఏకంగా పొట్టి దుస్తులు ధరించి హంగామా చేయడం సోషల్ మీడియాలో తుఫాను రేపుతోంది! ఆమె పెళ్లి ఫోటోలు నెట్టింట దూసుకెళుతున్నాయి. అందమైన లెహంగాను ధరించాల్సిన ఆ వధువు ఎవరూ ఊహించని విధంగా ఓ పొట్టి డ్రస్సుతో వచ్చేసింది. సంప్రదాయ వధువు ధరించే చోలీ, బంగారు ఆభరణాలు, దుప్పట్టాలను వేసుకుని లెహంగా స్థానంలో నైకీ బ్లాక్ షార్ట్స్ తో వచ్చి పెళ్లిలో పాల్గొంది. 



వీడియోలో కనిపిస్తున్న అతిథులు షరామామూలే అన్నట్టు ఊరుకున్నా.. ఆన్‌లైన్ లో ఈ అమ్మడి వీడియో చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వధువు ‘స్వంతంత్ర భావాలకు’ ఆమె ధరించిన జాకెట్ కాదు, ‘నైక్’ షార్టే నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: