gst on telugu cinema కోసం చిత్ర ఫలితం


వినోద రంగంపై ప్రత్యేకించి చలన చిత్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 28% వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాణాంతకంగా తయారైందని అంటున్నారు సినీ రంగ ప్రముఖులు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఈ పరిస్థితి "పురిట్లోనే సంధిగొటేఅలా తయారైంది" అని అత్యంత ఘోరంగా మారిందని తెలుస్తుంది. చాలా సినిమాల్లో వ్యయానికీ, వసూళ్లకూ మధ్య భయానక వ్యత్యాసం ఉంటూ నష్టాలు ఇప్పటికే తడిసి మోపెడవటం తప్పడం లేదు. టికెట్‌ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వినోదపు పన్ను కట్టాలి. 

gst on telugu cinema కోసం చిత్ర ఫలితం

కేంద్ర ప్రభుత్వం విధించే సేవా పన్ను (సర్వీస్ టాక్స్) దీనికి అదనంగా చెల్లించాలి. దీనికి తోడు నటులు, సాంకేతిక నిపుణుల సేవలపై పన్ను ఇప్పటిదాకా నిర్మాతపై పడుతూ వస్తోంది. ఇప్పుడది వస్తు సేవల పన్ను లో భాగం కావడం కొంతలో కొంత సంతృప్తినిస్తుంది. తమిళనాడు, కర్ణాటకల తరహాలో తెలుగు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వాలనుండి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. 

gst on telugu cinema కోసం చిత్ర ఫలితం

తమిళం పేరు పెట్టిన సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి "యు" సర్టిఫికెట్‌ లభిస్తే తమిళనాడు ప్రభుత్వం వినోద పన్ను 100 శాతం మినహాయింపునిస్తోంది. కర్ణాటకలో డబ్బింగ్‌ సినిమాలకు చోటు లేదు. తెలుగు సినిమా వరకు వస్తే చిన్న సినిమాపై 7%, పెద్ద సినిమాపై 14% వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సినిమాలపై విధించిన 28% వస్తు సేవల పన్ను జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. దీంతో ప్రాంతీయ సినిమా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంద ని ఆందోళన చెందుతున్నారు. 28% వస్తు సేవల పన్ను భారం  అసలే  ముక్కుతూ మూలుగుతున్న  చిన్న సినిమాకు ములిగే నక్కపై తాటిపండు పడ్దట్టుంటుందని చిన్న సినిమా పూర్తిగా పతనమయి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు,  ప్రముఖ నిర్మాతలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని ఉన్నత స్థాయి వ్యక్తులు వ్యాఖ్యానిస్తు న్నారు.

gst on telugu cinema కోసం చిత్ర ఫలితం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉదాహరణకు రూ.100 టికెట్‌ రేటు అనుకుంటే కొత్త పన్ను వ్యవస్థతో అందులో 35-42 శాతం పన్నులకే పోతుంది. కొత్త పన్ను విధానంతో పన్ను ఎగ్గొట్టే వాళ్ల ఆటలూ సాగవు. అంటే, మొత్తం పన్ను చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం వినోదపన్ను తీసివేసినా, సినిమాపై రూ.28 వస్తు సేవల పన్ను తప్పదు. మిగతా రూ.72% నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌ మొదలైన వాళ్ళు పంచుకుంటారు. అంటే పెద్ద సినిమాతో సమానంగా చిన్న సినిమా పన్నును చెల్లించాలన్న మాట.
 

01/07/2017 నుండి పెద్ద సినిమా టికెట్‌ రూ.100/- అనుకుంటే వస్తు సేవల పన్ను రూ.28,  వినోదపు పన్ను రూ.14, మిగిలేది రూ.58/-
01/07/2017 నుండి చిన్న సినిమా టికెట్‌ రూ.100/- అనుకుంటే వస్తు సేవల పన్ను రూ.28, వినోదపు పన్ను రూ.7, మిగిలేది రూ.65/-
01/07/2017 నుండి చిన్న సినిమా టికెట్‌ రూ.100/- అనుకుంటే వస్తు సేవల పన్ను విధించి వినోద పన్ను తొలగిస్తే అప్పుడు టికెట్‌ రూ.100 అనుకుంటే దానిపై వస్తు సేవల పన్ను రూ.28, పోగా మిగిలేది రూ.72/-


సంబంధిత చిత్రం

 

సినిమాకు పనిచేసే నటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అందరికీ 18% వస్తు సేవల పన్ను వర్తిస్తుంది ఇప్పటివరకూ ఇది 15% ఉండేది. స్టూడియోలు కూడా అంతే మొత్తం పన్ను చెల్లించాలి. సినిమాతో నేరుగా సంబంధం ఉండే అన్ని రకాల వస్తు సేవలపై 18% వస్తు సేవల పన్ను చెల్లించాలి. నిర్మాత నుంచి సినిమాను కొనే డిసి్ట్రబ్యూటర్‌, దాన్ని ప్రదర్శించే ఎగ్జిబిటర్‌పై 12% జీఎస్‌టీ పడుతుంది. 


ఇదంతా ఒక గొలుసుకట్టు వ్యవస్థ. వస్తు సేవల పన్ను వల్ల పారదర్శకత పెరుగుతుంది. పన్ను ఎగవేతలు సాధారణంగా కుదరటం కస్థం. నిర్మాత సినిమా తియ్యడం నుంచి, ప్రేక్షకుడి దగ్గరకు వెళ్లేవరకూ సినిమాతో నేరుగా సంబంధం ఉన్న వాళ్లంతా సరైన ఖాతాలను నిర్వహించాలి. ఏ ఒక్కరు లెక్క చూపకపోయినా, నిర్మాతకు తంటాయే. కాగా, స్థానిక ప్రభుత్వాల మద్దతు కారణంగానే ప్రాంతీయ సినిమా మనగలుగుతోంది. 

gst on telugu cinema కోసం చిత్ర ఫలితం


వస్తు సేవల పన్ను నేపథ్యంలో వినోదపు పన్నును మినహాయించాలని ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్ర పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన లభించిందని తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు. సినిమాపై వస్తు సేవల పన్ను 18% తగ్గించాలని కేంద్రాన్ని చిత్రసీమ అర్థిస్తోంది.
 
వస్తు సేవల పన్ను తో తెలుగు సినీ పరిశ్రమలో ఫిర్యాదులు లెక్కకుమించి పెరుగుతాయి. లెక్కలు చూపకుండా కథ నడిపించే అలవాటున్న వాళ్ళు ఇప్పుడు అలాచేస్తే వాళ్ళకు ఇక్కడ చిక్కులు తప్పవు. వినోదపు పన్నుకు తోడు వస్తు సేవల పన్ను భారం 28% పడుతుంది. ఫలితంగా సినిమాల ఆదాయం బాగున్నా మిగిలేది "హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే" అంటున్నారు. చిన్న సినిమా నిర్మాతలకు ఇది అతి పెద్ద కష్టం. చిన్న సినిమా తియ్యాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. 


gst on telugu cinema కోసం చిత్ర ఫలితం


సినీ పెద్దల అభిప్రాయం ప్రకారం జాతీయస్థాయి సినిమాలకూ, ప్రాంతీయస్థాయి సినిమాలకూ ఒకేరకమైన వస్తు సేవల పన్ను విధించడం సరికాదు. హిందీ సినిమాలకు 28% వస్తు సేవల పన్ను వల్ల మేలే జరుగుతుంది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమ 40% కు మించి అనీ పన్నులు కలిపి ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయని అదిప్పుడు 28% వస్తు సేవల పన్నుకే పరిమిత మౌతుంది. 


gst on telugu cinema కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: