ప్రపంచంలో కాదేదీ కల్తీకి అనర్హం..అన్న చందంగా ఉంది.  ఇప్పుడు ప్రకృతిపరంగా వస్తున్న ప్రతీది కల్తీ చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంత మంది స్వార్థపరులు.  ఇప్పటికే భారత దేశంలో గత ఎనిమిది నెలల నుంచి ప్లాస్టీక్ బియ్యం మార్కెట్ లోకి వచ్చాయని..ఆ ఆహారం తింటే కడుపు నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని జనాలు భయపడుతున్నారు.  ఈ బియ్యం ముంబాయి, ఢిల్లీ, కలకత్త నగరాల్లోనే అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కలకలం రేపింది.  

కేసు దర్యాప్తు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  అంతే కాదు కొన్ని రైస్ డీలర్ల పై రైడింగ్ కూడా చేశారు.    కందుకూరులో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం రేగింది. పట్టణంలోని మోర్‌ రిటైల్‌ ఔట్‌లెట్‌లో కొనుగోలు చేసిన బియ్యం ప్లాస్టిక్‌ బియ్యంగా అనుమానించిన ఓ యువకుడు అన్నంతో సహా తీసుకుని వచ్చి ఫిర్యాదు చేయటంతో వ్యవహారం బయటకు వచ్చింది.
Image result for ప్లాస్టీక్ బియ్యం
ప్లాస్టిక్‌ రైస్‌గా అనుమానం వ్యక్తమైన గజానన్‌ కంపెనీ క్వాడ్రట్‌ బ్రాండ్‌ బియ్యంపై అనుమానాలు రావటంతో మోర్‌లో నిల్వ ఉన్న ఆరకం 50 బస్తాల బియ్యాన్ని తహసీల్దార్‌ సీజ్‌ చేశారు. దీంతో ఆ రకం బియ్యాన్ని సీజ్‌చేసిన అధికారులు తనిఖీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్లాస్టీక్ బియ్యమే కాకుండా ప్లాస్టీక్ చక్కర వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బెంగళూరులోని హస్సన్‌ ప్రాంతానికి చెందిన శివకుమార్‌ అనే రైల్వే పోలీసు వారం రోజుల క్రితం ఓ దుకాణం నుంచి మూడు కిలోల చక్కెర కొనుగోలు చేశాడు.
Image result for ప్లాస్టీక్ బియ్యం
ఇంట్లో టీ పెడుతుండగా అందులో వేసిన చక్కెర కరిగిపోయి గిన్నెకి ప్లాస్టిక్‌ అంటుకోవడంతో వెంటనే మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ బియ్యం, కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరు దుకాణాల్లో ప్లాస్టిక్‌ పంచదార విక్రయాలు వెలుగులోకి రావడంతో జనాలు బెంబేలు పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: