రాజకీయం అన్నాక విమర్శ అనేది సహజం. రోజూ ఎంతో మంది నాయకులు మరెంతో మంది నాయకులపై విమర్శలు చేస్తూనే ఉండడం, మీడియా దాన్ని కవరేజ్ చేస్తూ ఉండడం అందరికీ తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కు మధ్య వార్ అందరి నేతల్లా కాకుండా 24*7 అన్న తరహాలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.


ఒక్క వర్షంతో ‘తాత్కాలిక’ బండారం బట్టబయలు

అయితే ఎప్పుడెప్పుడు బాబును ఏ అంశంపై విమర్శించుదామా అని చూస్తున్న జగన్ కు వెలగపూడి లో ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పగుళ్లు వచ్చి నీరు కారుతుందని తెలిసింది. అయితే జగన్ కార్యాలయంలో కూడా నీరు కారుతున్నట్లు సమాచారం వైసీపీ కార్యకర్తలకు అందింది. అయితే ఈ సమాచారాన్న అందుకున్న సాక్షి మీడియా ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సచివాలయ నిర్మాణం మొత్తం నాసిరకమని జగన్ కార్యాలయంలో అయితే ఏకంగా స్లాబ్ కి చిల్లు పడి వర్షం నీరే నేరుగా కురుస్తుందని కడిగి పారేస్తుంది.


అంతర్జాతీయ రాజధానికి ‘తొలి’ చిల్లు

కొట్లానుకోట్లు కుమ్మరించి ప్రభుత్వం దళారులతో కుమ్మక్కై నాసిరకం నిర్మాణాన్ని చేపడుతుందని ఆరోపించింది. ఇక జగన్ అయితే ఈ విషయం పై మీడియా పాయింట్ వద్ద బాబును ఏకి పారేసాడు. భారీ దోపిడీకి తెరతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక భవనాల నిర్మాణానికి ప్రపంచంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశారు. చదరపు అడుగుకు ఏకంగా రూ.10 వేలు ఖర్చుచేసి మొత్తం రూ.900 కోట్ల ప్రజాధానాన్ని బొక్కేశారు. నిర్మాణాలు తూతూ మంత్రంగా సాగుతుండటంపై గతంలోనే ‘సాక్షి’ అనేక కథనాలు రాసింది. కట్టిన ఆరు నెలల్లోనే రాజధాని బండారం బట్టబయలు కావడంతో నవ్వులపాలైన సర్కారు.. తాత్కాలిక భవనాల్లోకి మీడియాను అనుమతించకుండా పరుకుకాపాడుకునే వ్యర్థప్రయత్నం చేసిందని సాక్షి మీడియా ప్రచురించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: