జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నుండి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పవన్ అనంతపురం పై మరింత ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. అయితే పవన్ అనంతపురం జిల్లా మొత్తం తన కార్యకర్తలతో ఇప్పటికే నింపేసిన నేపథ్యంలో పవన్ ఇక అనంతపురానికే ఫిక్స్ అయినట్టు స్పష్టంగా కనబడడంతో అనంతపురం నుండి పవన్ ఎందుకు పోటీ చేస్తునట్లు..? అని పవన్ ని రాయలసీమ రాష్ట్ర సమితి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.


Image result for pawan kalyan janasena

రాజకీయలబ్ది కోసం పవన్ కళ్యాణ్ రాయలసీమను వేదికగా ఎంచుకొన్నాడని వారు ఆరోపిస్తున్నారు. కల్లో అనంతపురం నుండి పోటీచేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే రాయలసీమ నుండి పోటీచేయడానికి పవన్ కు ఉన్న వ్యూహమేమిటీ? అసలు రాయలసీమతో ఆయనకున్న సంబంధాలు ఏమిటీ ఆయన ఇక్కడికి వచ్చి తొడగొట్టి నిలబడడానికి గల కారణాలు ఏమిటీ అని వారు ప్రశ్నిస్తున్నారు.


Image result for pawan kalyan janasena

అయితే పవన్ కళ్యాణ్ పై ఇప్పటికిప్పుడే రాయలసీమ రాష్ట్రసాధన సమితి ఎందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందనే విషయం అర్ధం కావడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయమై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: