బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించి, మరోసారి థెరిసా మే ప్రధానిగా బాధ్యతలు చేపడతారనుకున్న తొలి అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన రెండు ఉగ్రదాడులు అధికార "కన్సర్వేటీవ్‌ పార్టీ" పై భారీగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది అంతేకాదు కన్జర్వేటివ్ పార్టీ గెలుపు అవకాశాలను బాగా దెబ్బతీశాయి. 650 స్థానాలున్న "హౌస్ ఆఫ్ కామన్స్‌" (బ్రిటిష్ పార్లమెంట్) లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 326 స్థానాలను అధికారపార్టీ దక్కించు కోలేకపోయింది. 

uk general election results 2017 కోసం చిత్ర ఫలితం

బ్రెగ్జిట్‌ చర్చల సమర్థత అంశంతో ఇంకా సమయం ఉండగానే  ముందస్తు  ఎన్నికలకు వెళ్లిన ప్రధాని థెరిసా మే, మెజార్టీ స్కోర్ సాధించడంలో ధారుణంగా విఫలమయ్యారు. ఫలితాల్లో కన్సర్వేటీవ్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించడంలో విఫలమవటంతో బ్రిటన్‌లో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడనుంది.

uk general election results 2017 కోసం చిత్ర ఫలితం

ఇప్పటివరకు వెలువడిన 646 పార్లమెంట్ స్థానాల ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ 315 స్థానాల్లో విజయం సాధించగా, జిరోమీ కార్బిన్ నాయకత్వంలోని లేబర్ పార్టీ 261 స్థానాల్లో విజయం సాధించింది. స్కాటిస్ట్ నేషనల్ పార్టీ 35 స్థానాలు, లిబరల్ డెమోక్రాట్స్ 12 స్థానాలు ఇతరులు 23 స్థానాల్లో విజయం సాధించారు.


దీంతో బ్రిటన్ పౌండ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో పతనం దిశగా సాగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తనకు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలను రాబట్టుకోవడంలో విఫలమైందన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. 


ఓట్ల లెక్కింపు ప్రారంభంలో లేబర్‌పార్టీ ఆధిక్యంలో ఉన్నా క్రమంగా వెనుకబడింది. కన్సర్‌వేటీవ్‌ పార్టీ 44.5 శాతం ఓట్లు సాధించగా, లేబర్‌ పార్టీకి 38.5 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఫలితాల నేపథ్యంలో 'మెజారిటీ మార్క్‌' ను సాధించలేక పోయిన థెరిసా మే ను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా జిరొమి కార్బిన్‌ కోరారు. దానికి ఆమె తిరస్కరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: