నగరంలోని పాతబస్తీలో ఓ చిన్నారి పాప ఆడుకుంటూ భవనం పైనుంచి పడిపోయింది.  ఈ పాప వయసు 18 నెలలు అని తెలుస్తుంది..అయితే భవనంపైన ఉన్న కిటికీ వద్ద ఆడుకుంటున్న చిన్నారి ఫాతిమా అకస్మాత్తుగా పై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది. . తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  అయితే పాప కిటికీ వద్ద ఆడుకుంటున్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.  

అయితే ఈ మద్య కొంత మంది చిన్నారు రోడ్డు పైకి రావడం..మోటర్ బైక్, కారు ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు అంటున్నారు.  ఫాతిమా ఆడుకుంటుండగా పొరపాటున ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందని, దీంతో తలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు.

మరో 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఏంటన్నది చెప్పలేమని అంటున్నారు. ఫాతిమాకు ఏమైతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: