తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మాయిల పాలిట అభయ హస్తంగా, వారిని కంటికి రెప్పలా కాపాడడానికి, పోకిరీల నుండి వారిని రక్షించడానికి 'షీ' టీమ్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అమ్మాయిలను ఆటపట్టించే ఆకతాయిలకు షీ టీమ్స్ తగిన బుద్ధి చెబుతాయని ఇప్పటివరకు చాలా సార్లు మన ముఖ్యమంత్రి గారూ బహిరంగ సమావేశాల్లో, మీడియా సమావేశంలో వల్లెవించడం జరిగింది. కానీ కేసీఆర్ మాటలకు వాస్తవ సంఘటనలకు అసలు పొంతనే కుదరడం లేదు.  ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఆమెకు జరిగిన అవమానం అంతా ఇంత కాదు. అసలు చెప్పుకోలేని స్థితిలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె కళ్లకు కట్టినట్లు చూపించారు.



ఇంతకీ ఏం జరిగిందంటే..పాతికేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న ఒక రిటైర్డ్ ఇంజనీర్ జీడిమెట్ల లో ఒక అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటారు. ఆమె కుమార్తె అమీర్‌పేటలో నివసిస్తారు. అనారోగ్యం కారణంగా ఆయనను చూసుకోడానికి అసోంకు చెందిన ఒక వ్యక్తిని నియమించారు. అయితే అతన్ను  వారు పూర్తిగా నమ్మడంతో ఆ నమ్మకాన్నే ఆసరాగా తీసుకొని అతను వారిని నిండా ముంచాడు. మే 30న ఆయన నిద్రపోతుండగా రూ. 45 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. అతడు లేకపోవడంతో రిటైర్డ్‌ ఇంజనీర్‌ అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని కూతురికి చెప్పారు. అయితే ఆమె ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.


Image result for telangana police

అయితే తండ్రి తేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని కూతురికి  చెప్పడంతో  6వ తేదీన దొంగతనంపై ఫిర్యాదు చేయడానికి జీడిమెట్ల ఠాణాకు ఆమె వెళ్లారు. ఘటనాస్థలాన్ని చూడాలని పోలీసులు చెప్పడంతో.. వారిని అపురూప టౌన్‌షిప్‌ వద్దకు ఆమె తీసుకెళ్లారు.అక్కడ ఆమె వివరాలు చెబుతుంటే ఒక కానిస్టేబుల్ వివరాలు నమోదు చేసుకుంటూ ఉండగా.. మరో కానిస్టేబుల్ మాత్రం ఆమె చాతిని తదేదకంగా చూడడం ప్రారంభించాడు. 15 నిమిషాల పాటు ఏకధాటిగా అదేపని చేశారు. దానిపై ఆమె 6వ తేదీన తెలంగాణ పోలీస్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌చేశారు. ఇప్పటివరకు ఈ అంశంపై పోలీసులు స్పందించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: