సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురయ్యి, బంగారు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో పలువురు పెద్దల సహకారంతో సవతి తల్లి చేర నుండి విడిపించుకొని మీడియా లో అప్పుడు ఒక పెద్ద సంచలనంగా నిలిచిన ప్రత్యూష అందరికీ సుపరిచితమే. అయితే ఆ సమయంలో ఈమె గురించి తెలుసుకొని ఆమెను చేరదీసి మరీ తన ఇంట్లో రెండు రోజులు ఆశ్రయం కల్పించి తను కోరుకున్న విధంగా తన జీవితాన్ని మల్చుకునే సదావకాశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన విషయం అందరికీ విదితమే.



అయితే కేసీఆర్ తన దత్త పుత్రిక గురించి ప్రభుత్వ అధికారులు ఆరా తీయగా  ఆమె నర్సింగ్‌ కోర్సు చేస్తోందన్న సమాచారాన్ని అధికారులు మంగళవారం సీఎంకు వివరించగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు. అయితే గతంలో ఒక సారి ఈమె అబ్బాయిని ప్రేమించిందని అతనినే పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధ పడినట్లు కేసీఆర్ అనుమతి కూడా ఆమె తీసుకోనున్నట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.



కానీ తర్వత ఈమెకు సంబంధించిన ఏ సమాచారం కూడా బయటకు పొక్కలేదు. కానీ కేసీఆర్ తన దత్త పుత్రిక ఎలా ఉందో ఆరా తీయమని అధికారులను కోరగా మళ్లీ ఆమె వార్తల్లోకి రావడం జరిగింది. అయితే కేసీఆర్ ఆ అమ్మాయికి నచ్చిన విధంగా చదివించడం మాత్రమే కాకుండా మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి కూడా జరిపిస్తానని ఆమెను దత్తత తీసుకున్న రోజు ఆయన ప్రకటించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: