రూపాయి కాదు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కాదు కర్ణాటక లో కాంగ్రెస్ మంత్రి ఒకరు రోజుకి నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఖర్చు పెట్టి భోజనం చేసారు. గత ఏడాది బెళగావిలో శీతాకాల కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పాటు జరిగాయి. ఆ పది రోజుల్లో చట్టసభ లో అనేక విషయాల మీద చర్చ జరిగింది.


ఆ చర్చ యాభై ఐదు గంటల వరకూ నడిచింది. అసంబ్లీ కి వచ్చిన వారు అందరికీ స్థానిక ఫైవ్ స్టార్ హోటల్ లో యాభై మూడు గదుల వరకూ అద్దెకి తీసుకున్నారు. దీనికోసం యాభై లక్షలు తగలేశారు. ప్రజా ప్రతినిధుల తిండి విషయం లో తీవ్ర దుబారా చేస్తూ ఆ రాష్ర్ట న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర ఏకంగా పది రోజుల భోజన ఖర్చులు రూ.47,033 గా చూపించారు. అంటే రోజుకు రూ.4,700 ఆయన భోజ‌నానికే ఖ‌ర్చ‌యింద‌న్న‌మాట‌.


జేడీయూ నేత కుమార స్వామి ఆ రోజు రాత్రి తిన్న భోజనం ఖరీదు మూడు వేల పైమాటే.. ఐవాన్ డిసోజా అనే వ్యక్తి కూడా అంతే ఖర్చు పెట్టి తిన్నారు. బీజేపీ పక్ష నేత జగదీశ్‌ శెట్టర్‌ ఒక్కరే అందరి కంటే తక్కువగా రోజుకు రూ.50లతో  భోజనం చేశారట. ప్రజా ధనాన్ని నాయకులు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి ఇది కేవలం అత్యంత చిన్న ఉదాహరణ .


మరింత సమాచారం తెలుసుకోండి: